Tuesday, November 19, 2024

Layoffs | 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాక్సెంచర్‌

ఐర్లాండ్‌ చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ దాదాపు 19,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. కంపెనీపై ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇదే క్రమంలో కంపెనీ వార్షిక ఆదాయం వృద్ధిరేటు, లాభాల అంచనాలను కూడా స్పల్పంగా తగ్గించుకుంది. ఈ ఏడాది కంపెనీ వార్షిక ఆదాయాన్ని 8-10 శాతంగా అంచనా వేసింది.

గతేడాది అంచనాలతో పోలిస్తే, ఇది ఒక శాతం తక్కువ. ఇప్పటికే పలు కంపెనీలు ఆర్థికపరమైన భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టి విషయం తెలిసిందే. పలు అమెరికన్‌ ఐటీ సంస్థలు భారతదేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. గతంలో ఆయా సంస్థలు లేఆఫ్‌లు విధించిన సమయంలో భారత్‌లోని ఉద్యోగులపై కూడా ప్రభావం చూపింది. ఈ క్రమంలో యాక్సెంచర్‌ కోతల నిర్ణయంతో భారత్‌లో ఎంత మందిపై ప్రభావం ఉంటుందనేది తెలియాల్సివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement