Tuesday, November 26, 2024

17 శాతం తగ్గిన బంగారం దిగుమతులు

డిమాండ్‌ తగ్గడంతో ఈ ఆర్ధిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి. 2022 ఏప్రిల్‌-అక్టోబర్‌ నెలల మధ్య బంగారం దిగుమతులు 17 శాతం తగ్గి, 24 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు కేంద్ర వాణిజ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే సమయంలో భారత్‌ 29 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది.

అక్టోబర్‌ నెలలో బంగారం దిగుమతుల విలవ 27.47 శాతం తగ్గి 3.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇదే సమయంలో వెండి దిగుమతులు 34.80 శాతం తగ్గి 585 మిలియన్‌ డాలర్లకు చేరాయి. మొత్తంగా ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య వెవండి దిగుమతుల విలువ వార్షిక ప్రాతిపదికన 1.52 బిలి యన్‌ డాలర్ల నుంచి 4.8 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. మరో వైపు ఈ ఏడాది తొల ఏడు నెలల్లో సరకుల వాణిజ్య లోటు క్రితం సంవత్సరంతో పోలిస్తే 94.16 బిలియన్‌ డాలర్ల నుంచి 173.46 బిలియన్‌ డాలర్లకు చేరింది.

రత్నాభరణాల ఎగుమతి విలువ ఏప్రిల్‌-అక్టోబర్‌లో 1.81 శాతం పెరిగి 24 బిలియన్‌ డాలర్లకు చేరింది. ప్రపంచంలో పెద్ద ఎత్తున బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ ఒకటి. అభరణాల పరిశ్రమలో అధికంగా గిరాకీయే దీనికి కారణం. ఏటా 800-900 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి తిరిగి బంగారానికి డిమాండ్‌ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement