Friday, October 18, 2024

Inorbit Mall సైబరాబాద్‌ లో 15వ వార్షికోత్సవం…

హైదరాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ) : ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ తమ 15వ వార్షికోత్సవ వేడుకలను ప్రకటించింది. హైదరాబాద్‌ లో ఎక్కువ మంది ఇష్టపడే ఈ మాల్ అక్టోబర్ 14న 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకల ప్రారంభోత్సవ సూచికగా క్రిస్పీ క్రీమ్ డోనట్స్‌ను పిల్లలకు కాంప్లిమెంటరీగా అందిస్తుంది.

ఈ ఉత్సవాలతో పాటు, తమ రిటైల్ భాగస్వాములు ఔఖేరా ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టోర్స్, అజోర్ట్ ను సైతం ప్రారంభించింది. ఇంకా నవంబర్‌లో డెకాథ్లాన్ ప్రారంభించబడుతోంది. తద్వారా షాపర్లకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.

ఈ సందర్భంగా ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ సెంటర్ హెడ్ శరత్ బెలవాడి మాట్లాడుతూ… ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌ తమ 15 సంవత్సరాల ప్రయాణంలో భాగమైన కస్టమర్‌లు, భాగస్వాములకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేడుకలు నిర్వహిస్తుందన్నారు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లేదా లైఫ్‌స్టైల్ వంటి అనేక అంశాల్లో నగరం విపరీతమైన వృద్ధిని సాధించిందన్నారు. తాము తమ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మారుతున్న కాలానికి అనుగుణంగా, మరిన్ని ప్రీమియం బ్రాండ్‌లను జోడించడం ద్వారా తమ మాల్ రూపాన్ని, సేవలను, కేటగిరీ మిక్స్‌ను ఆధునీకరించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement