Friday, November 22, 2024

ఎయిర్‌ ఇండియా కోసం 15వేల కోట్ల రుణం.. బ్యాంక్‌లను సంప్రదిస్తున్న టాటా గ్రూప్‌

ఎయిర్‌ ఇండియా వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం టాటా గ్రూప్‌ బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతోంది. ఇందు కోసం 15 వేల కోట్ల రుణాలు సేకరించాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. రోజు వారి సర్వీస్‌లు పెంచడం, నష్టాలను తగ్గించుకోవడం, ఎయిర్‌ క్రాఫ్ట్‌ అద్దె చెల్లింపులు, ఐటీ సిస్టమ్స్‌ను ఆధునీకరించడం వంటివాటి కోసం టాటా గ్రూప్‌ రుణాలను సేకరించనుంది.


ప్రభుత్వం నుంచి ఎయిర్‌ ఇండియాను టాటాలు కొనుగోలు చేసేందుకు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కలిసి 23 వేల కోట్లు రుణంగా సమకూర్చాయి. ఈ రుణాన్ని కేవలం 4.25 శాతం వడ్డీకే బ్యాంక్‌లు అందించాయి. టాటా సన్స్‌ ఏర్పాటు చేసిన టెల్‌సీ కంపెనీ పేరుతో ఎయిర్‌ ఇండియాను 18 వేల కోట్లకు కొనుగోలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement