Saturday, November 23, 2024

Bank Holidays | వ‌చ్చే నెల‌లో 15రోజులు బ్యాంకులకు సెల‌వు..

బ్యాంక్‌ సెలవుల కారణంగా లావాదేవీల విషయంలో ఖాతాదార్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుగానే బ్యాంక్‌ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. కాగా, వచ్చే నెలలో (సెప్టెంబర్‌ 2024), వివిధ పండుగలు & సందర్భాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల కారణంగా బ్యాంక్‌లు మొత్తం 15 రోజులు పని చేయవు. బ్యాంక్‌ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి మారతాయి.

సెప్టెంబ‌ర్ 7న (శ‌నివారం) వినాయ‌క చవితి, ఆ వెంట‌నే ఆదివారం కావ‌డంతో వ‌రుస‌గా రెండు రోజులు బ్యాంకుల‌కు సెల‌వు వ‌చ్చింది. ఇక 14వ తేదీన రెండో శ‌నివారం, 15న ఆదివారం, 16న ఈద్ సంద‌ర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.

సెప్టెంబర్‌ నెలలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍:

  • 01 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
  • 05 సెప్టెంబర్ 2024, ‍(గురువారం) – శ్రీమంత శంకర్‌దేవ్, హర్తాళికా తీజ్ – అస్సాం, ఛత్తీస్‌గఢ్, సిక్కిం
  • 07 సెప్టెంబర్ 2024, (శనివారం) – వినాయక చవితి – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
  • 08 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
  • 13 సెప్టెంబర్ 2024, (శుక్రవారం) – తేజ దశమి – రాజస్థాన్‌లో బ్యాంక్‌లకు హాలిడే
  • 14 సెప్టెంబర్ 2024, (శనివారం) – రెండో శనివారం + ఓనం పండుగ
  • 15 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
  • 16 సెప్టెంబర్ 2024, (సోమవారం) – ఈద్ ఇ మిలాద్ – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
  • 17 సెప్టెంబర్ 2024, (మంగళవారం) – ఇంద్ర జాత్ర – సిక్కింలో బ్యాంక్‌లకు సెలవు ఇస్తారు
  • 18 సెప్టెంబర్ 2024, (బుధవారం) – శ్రీ నారాయణ గురు సమాధి – కేరళలో బ్యాంక్‌లకు హాలిడే
  • 21 సెప్టెంబర్ 2024, (శనివారం) – శ్రీ నారాయణ గురు సమాధి, కేరళలో బ్యాంక్‌లకు హాలిడే
  • 22 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
  • 23 సెప్టెంబర్ 2024, (సోమవారం) – అమరవీరుల దినోత్సవం – హరియాణాలో అధికారిక సెలవు
  • 28 సెప్టెంబర్ 2024, (శనివారం) – నాలుగో శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
  • 29 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
Advertisement

తాజా వార్తలు

Advertisement