బ్యాంక్ సెలవుల కారణంగా లావాదేవీల విషయంలో ఖాతాదార్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుగానే బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. కాగా, వచ్చే నెలలో (సెప్టెంబర్ 2024), వివిధ పండుగలు & సందర్భాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల కారణంగా బ్యాంక్‌లు మొత్తం 15 రోజులు పని చేయవు. బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి మారతాయి.
సెప్టెంబర్ 7న (శనివారం) వినాయక చవితి, ఆ వెంటనే ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవు వచ్చింది. ఇక 14వ తేదీన రెండో శనివారం, 15న ఆదివారం, 16న ఈద్ సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.
సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవు రోజులు :
- 01 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
- 05 సెప్టెంబర్ 2024, (గురువారం) – శ్రీమంత శంకర్‌దేవ్, హర్తాళికా తీజ్ – అస్సాం, ఛత్తీస్‌గఢ్, సిక్కిం
- 07 సెప్టెంబర్ 2024, (శనివారం) – వినాయక చవితి – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
- 08 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
- 13 సెప్టెంబర్ 2024, (శుక్రవారం) – తేజ దశమి – రాజస్థాన్‌లో బ్యాంక్‌లకు హాలిడే
- 14 సెప్టెంబర్ 2024, (శనివారం) – రెండో శనివారం + ఓనం పండుగ
- 15 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
- 16 సెప్టెంబర్ 2024, (సోమవారం) – ఈద్ ఇ మిలాద్ – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
- 17 సెప్టెంబర్ 2024, (మంగళవారం) – ఇంద్ర జాత్ర – సిక్కింలో బ్యాంక్‌లకు సెలవు ఇస్తారు
- 18 సెప్టెంబర్ 2024, (బుధవారం) – శ్రీ నారాయణ గురు సమాధి – కేరళలో బ్యాంక్‌లకు హాలిడే
- 21 సెప్టెంబర్ 2024, (శనివారం) – శ్రీ నారాయణ గురు సమాధి, కేరళలో బ్యాంక్‌లకు హాలిడే
- 22 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
- 23 సెప్టెంబర్ 2024, (సోమవారం) – అమరవీరుల దినోత్సవం – హరియాణాలో అధికారిక సెలవు
- 28 సెప్టెంబర్ 2024, (శనివారం) – నాలుగో శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు పని చేయవు
- 29 సెప్టెంబర్ 2024, (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు