Saturday, November 23, 2024

Bank Holidays | అక్టోబర్‌లో బ్యాంక్‌లకు 15 రోజుల సెలవులు

అక్టోబర్‌లో ఈ సారి అత్యధికంగా 15 రోజుల పాటు బ్యాంక్‌లకు సెలవులు వచ్చాయి. రాష్ట్రాల వారీగా కొన్ని పండుగల విషయంలో తేదీల్లో తేడాలు ఉన్నప్పటికీ, మొత్తంగా చూస్తే బ్యాంక్‌లకు సగం రోజులు సెలవులు రానున్నాయి. వీటిలో రెండో శనివారాలు, ఆదివారాలు కూడా కలిసి ఉన్నాయి.

అక్టోబర్‌ 2న గాంధీ జయంతితో ఈ సెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఇదే నెలలో దసర, దీపావళి కూడా వస్తోంది. అక్టోబర్‌ 10న దుర్గా పూజా, దరస పండగను త్రిపుర, అస్సాం, నాగాలాండ్‌, పశ్చిమ బెంగాల్లో జరుకుంటారు అందు వల్ల ఈ రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు 10న సెలవు ఉంటుంది. అక్టోబర్‌ 11న మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా, తమిళనాడు, సిక్కిం, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, ఝార్కండ్‌, మేఘాలయల్లో దసర సెలవు ఉంటుంది. 12న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు, కేరళ, ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లి, గోవా, బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో దరస సెలవు ఉంటుంది. అక్టోబర్‌ 31న దీపావళి సెలవు ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement