Tuesday, December 3, 2024

వైభ‌వంగా కె ఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ 14వ స్నాతకోత్సవం

హైద‌రాబాద్, (ఆంధ్రప్రభ) : కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ తమ 14వ వార్షిక స్నాతకోత్సవాన్ని విజయవాడ క్యాంపస్‌లో వైభవంగా జరుపుకుంది. ఇది విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు మహోన్నత సందర్భంగా నిలిచింది. ఈసంవత్సరం 166 పిహెచ్‌డి స్కాలర్స్, 604 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 3,936 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులతో సహా 4,706 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.

అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 42బంగారు పతకాలు, 37 రజత పతకాలను కూడా ప్రదానం చేశారు. భారత 14వ రాష్ట్రపతి, ప్ర‌స్తుత మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరైనందున, ఈ సందర్భంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

భవిష్యత్తును రూపొందించడంలో విద్య, సమగ్రత, ఆవిష్కరణల పరివర్తన శక్తిని వెల్లడిస్తూ, విద్యార్థులను నిరంతర అభ్యాసాన్ని స్వీకరించడానికి, వారు పూర్తి సామర్థ్యాన్ని సాధించడానికి కృషి చేయడానికి స్ఫూర్తిని అందించేలా ఆయన ఆలోచనాత్మకమైన రీతిలో స్నాతకోత్సవ ప్రసంగాన్ని చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర గౌరవ అతిథిలలో జస్టిస్ అబ్దుల్ నజీర్ జీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అండ్ భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వున్నారు. వీరితో పాటుగా పాల్గొన్న ఇతర విశిష్ట అతిథులలో రామ్ నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్ కూడా వున్నారు. కెఎల్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం కులపతి కోనేరు సత్యనారాయణ ఈ వేడుకలకు అధ్యక్షత వహించారు.

తన దూరదృష్టితో కూడిన సందేశంతో పట్టాలు తీసుకుంటున్న విద్యార్థులను ప్రేరేపించారు. అనంత‌రం ఆయన మాట్లాడారు. అలాగే కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. జి.పార్ధ సారధి వర్మ సంస్థ పరివర్తన ప్రయాణాన్ని నొక్కిచెప్పారు. అదేవిధంగా బి టెక్, సిఎస్ఈ విద్యార్థిని ఆర్.ప్రియాంక తన కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ త‌న ప్రయాణం నిజంగా అద్భుతమైనదని, పూర్తి అభ్యాసంతో ఉందన్నారు. ఒక పేరెంట్ ఎస్.వెంకటేష్ మాట్లాడుతూ… తల్లిదండ్రులుగా, ఇంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం నుండి త‌న బిడ్డ గ్రాడ్యుయేట్ కావడం త‌నలో ఎనలేని ఆనందాన్ని నింపుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement