Tuesday, November 26, 2024

హైదరాబాద్‌లో 14,693 ఇళ్ల రిజిస్ట్రేషన్లు.. డేటా వివరాలు వెల్లడించిన నైట్​ఫ్రాంక్​ ఇండియా

హైదరాబాద్‌, జులై 8 (ప్రభ న్యూస్‌) : హైదరాబాద్‌లో ఈ ఏడాది జనవరి-జూన్‌లో 14,693 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2011 తర్వాత అంతకుమించి ఇళ్ల విక్రయాలు జరిగింది ఇప్పుడే. 2013 నుంచి ఇళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఆరునెలల్లో 4శాతం ప్రియమయ్యాయి. దేశవ్యాప్తంగా 8నగరాల్లో రికార్డు స్థాయిలో ఇళ్ల విక్రయాల్లో 60శాతం వృద్ధి నమోదైంది. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయిలో విక్రయాలు జరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది. ఐటీ రంగంపై కోవిడ్‌ ప్రభావం పెద్దగా లేకపోవడంతో హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్‌ కొనసాగుతోందని విశ్లేషించింది. ఇటీవల వరకు గృహ రుణ వడ్డీరేట్లు తక్కువగా ఉండటం కలిసొచ్చిందని పేర్కొంది. మున్ముందు సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలో గృహ నిర్మాణ రంగ వాటా 62శాతంగా ఉంది. కొత్తగా 21,356 ఇళ్లు నిర్మితమవుతున్నాయి. వార్షిక వృద్ధి 28శాతంగా ఉంది.

కార్యాలయాల లీజింగ్..

2021 తొలి అర్ధభాగంలో 16లక్షల చ.అ. మేర కార్యాలయ భవనాల లీజింగ్‌ జరగ్గా.. 2022 ఇదే సమయంలో 32లక్షల చ.అడుగులకు పెరిగింది. పూర్తయిన నిర్మాణాలు 53లక్షల చ.అ. కు చేరాయి. వార్షిక వృద్ధి 62శాతంగా ఉంది. అద్దెలు 3శాతం పెరిగాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement