Monday, November 25, 2024

Layoffs | పేటీఎంలో 1000 మంది ఉద్యోగులపై వేటు.. వ్యయ నియంత్రణకే అన్న సంస్థ

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్‌7 కమ్యూనికేషన్స్‌ దాదాపు 1000 మంది ఉద్యోగులను తొలగించింది. వ్యయ నియంత్రణ, వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో భాగంగా వివి ధ విభాగాలకు చెందిన ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది. రిటైల్‌ రుణాల జారీని తగ్గించుకోవడం, యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ఇప్పుడు కొనండి తరువాత చెల్లించడి (బీఎన్‌పీఎల్‌) రుణాలను నిలిపివేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నందున పేటీఎం ఉద్యోగులను తగ్గించుకోవాలని నిర్ణయించింది.

బిజినెస్‌ను పనర్‌వ్యవస్థీకరించాలనే భారీ వ్యూహంలో ఉద్యోగుల తొలగింపు ఒక భాగమని పేటీఎం తెలిపింది. భవిష్యత్‌లో మరిన్ని వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గత సంవత్సర కాలంలో గణనీయ వృద్ధి నమోదు చేసిన రుణ విభాగం నుంచే అత్యధిక తొలగింపులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఉద్యోగులపై చేస్తున్న వ్యయంలో 10-15 శాతం తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు ఈ వర్గాలు తెలిపాయి. మరోవైపు 50,000 రూపాయల కంటే తక్కువ రుణాలను జారీ చేసే పేటీఎం పోస్ట్‌ పెయిడ్‌ విభాగాన్ని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌గా మార్చాలని పేటీఎం నిర్ణయించింది. పోస్ట్‌ పెయిడ్‌ లోన్‌ ప్లాన్‌ ఉపసంహరించుకున్నట్లు పేటీఎం ఇప్పటికే ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement