Tuesday, November 26, 2024

1.15 లక్షల కోట్లు పెరిగిన కంపెనీల సంపద.. కలిసి వచ్చిన స్టాక్‌మార్కెట్ల లాభాలు

దేశంలో టాప్‌ 10లో ఉన్న 8 కంపెనీల మార్కెట్‌ సంపద గత వారం 1,15,837 కోట్లు పెరిగింది. గత వారం మొత్తం స్టాక్‌మార్కెట్లు లాభాలు గడించాయి. అన్నింటి కంటే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యధికంగా లాభపడింది. టాప్‌ 10లోఉన్న హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌ సి బ్యాంక్‌ల మార్కెట్‌ విలువ మాత్రమే తగ్గింది.. గత వారం బీఎస్‌సీ ఇండెక్స్‌ 574.86 పాయింట్లు లాభపడింది. బెంచ్‌మార్క్‌ సూచీ 63 వేలకుపైగానే పెరిగింది. మార్కెట్ల లాభాలతో టాప్‌ టెన్‌లో ఉన్న కంపెనీల మార్కెట్‌ సంపద కూడా భారీగా పెరిగింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ సంపద ఏకంగా 71,462.28 కోట్లు పెరిగి 18,41,994.48 కోట్లుకు చేరింది. హిందూస్థాన్‌ యూనిలీవర్‌ మార్కెట్‌ సంపద 18,491.28 కోట్లు పెరిగి 6,14,488.60 కోట్లకు చేరింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) 18,441.62 కోట్ల పెరగడంతో సంపద 12,58,439.24 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌ కంపెనీ సంపద 3,303.5 కోట్లు పెరిగి, 6,89,515.09 కోట్లకు చేరింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ మార్కెట్‌ సంపద 2,063.4 కోట్లు పెరిగి 4,47,045.74 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్‌ సంపద 1,140.46 కోట్లు పెరిగి 4,72,234.92 కోట్లకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ సంపద 845.21 కోట్లు పెరిగి 6,49,207.46 కోట్లకు చేరింది. ఎస్‌బీఐ సంపద 89.25 కోట్లు పెరిగి 5,42,214.79 కోట్లకు చేరింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలువ 5,417.55 కోట్లు తగ్గడంతో నికర సంపద 8,96,106.38 కోట్లకు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ విలువ 2,282.41 కోట్లు తగ్గి 4,85,626.22 కోట్లకు తగ్గింది.

- Advertisement -

గత వారం స్టాక్‌ మార్కెట్లు లాభాలు గడించడంతో ఈ కంపెనీల షేర్ల విలువ పెరిగింది. దీంతో కంపెనీల నికర మార్కెట్‌ సంపద పెరిగింది. షేర్ల ధరలు తగ్గిన రెండు కంపెనీల మార్కెట్‌ సంపద తగ్గింది. స్టాక్‌మార్కెట్‌లో షేర్ల ధరలు పెరిగి లాభపడితే సాధారణంగా దాన్ని ఇన్వెస్టర్ల సంపదగా లెక్కిస్తారు. నష్టపోయినప్పటికీ దాన్ని ఇన్వెస్టర్లు నష్టపోయారనే పేర్కొంటారు. సాంకేతికంగా చూస్తే అది కంపెనీల సంపదనే. వారం మొత్తం ట్రేడింగ్‌లో సాధారణంగా టాప్‌ 10 కంపెనీల మార్కెట్‌ సంపదను పరిగణలోకి తీసుకుంటున్నారు. బీఎస్‌సీ ఇండెక్స్‌ 30 లో ఉన్న టాప్‌ 10 కంపెనీలు ఇవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement