Friday, November 22, 2024

వాట్సప్‌లో మరో ఫీచర్‌ ఇక తిరుగులేదు..


వాట్సప్‌ యూజర్లకు శుభవార్త.. ఇక నుంచి వాట్సప్‌ డెస్క్‌ టాప్‌ యాప్‌ నుంచి వాయిస్‌ కాల్స్‌ వీడియో కాల్స్‌ చేసుకునే వెసులుబాటును యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్తగా లాంఛ్‌ చేసిన ఈ ఫీచర్‌‌లో వాట్సప్‌ వీడియో కాల్స్‌, గ్రూప్‌ కాల్స్‌ ను డెస్క్‌ టాప్‌ నుంచి చేసుకోవచ్చు. కంప్యూటర్‌, ల్యాప్‌ టాప్‌లో వాట్సప్‌ వెబ్‌ ఉపయోగించేవారికి ఈ పీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. వాట్సప్‌ డెస్క్‌ టాప్‌ ద్వారా చేసే వీడియో కాల్స్‌, వాయిస్‌ కాల్స్‌ కి ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంటుందని వాట్సప్‌ ప్రకటించింది. కరోనా సంక్షోభంలో వీడియో కాల్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌కి ఎక్కువగా డిమాండ్‌ పెరగడంతో వాట్సప్‌ కూడా అందుకు అనుగుణంగా వీడియో కాన్ఫరెన్స్‌ చేసుకునే విధంగా కొత్త ఫీచర్‌ను డెవలప్‌ చేసింది. డెస్క్‌ టాప్‌లో వాట్సప్‌ కాలింగ్‌ ఫీచర్‌ వాడుకోవాలంటే (విండోస్-10 64-బిట్‌ వెర్షన్‌ 1903) లేదా అంతకన్నా కొత్తది ఉండాలి. MACOS‌ 10.13 లేదా అంతకన్నా లేటెస్ట్‌ వర్షన్‌ ఉండాలి. వీటితో పాటు యాక్టీవ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement