Business | లాభాల‌కు బ్రేక్… న‌ష్టాల‌తో ట్రేడింగ్

దేశీయ స్టాక్ మార్కెట్ల‌లో వ‌రుస‌గా వ‌స్తున్న లాభాల‌కు బ్రేక్ ప‌డింది. ఇవాళ‌ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ రంగంలోని షేర్ల అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దాంతో ఇన్వెస్టర్లు ఆచితూచి ట్రేడింగ్ చేస్తున్నారు. అయితే, ప్రారంభ నష్టాల తర్వాత సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 19 పాయింట్లు నష్టపోయి 76,345 వద్ద, నిఫ్టీ 1 పాయింటు లాభంతో 23,183 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జొమాటో, టైటాన్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.20 వద్ద కొనసాగుతోంది. గురువారం నాడు అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ సూచీ 0.22 శాతం, నాస్‌డాక్ 0.33 శాతం నష్టపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *