Breaking| గుజరాత్ లో బస్సు, ట్రక్కు ఢీ… ఏడుగురు దుర్మరణం

గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, మరో 20మంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో వెళ్తున్న ప్రయాణీకుల బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఏడుగురు మరణించారు. ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ప్రయాణీకులుండగా, వారిలో సగం మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *