మారేడుమల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం

తృటిలో తప్పిన పెను ముప్పు
చింతూరు, ఆంధ్రప్రభ : చింతూరు–మారేడుమల్లి ఘాట్‌ రోడ్డులో ప్రయివేట్ బస్సు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. శనివారం చైనా వాల్‌ సమీపంలోని గోడను ఢీకొనడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

అయితే బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. మారేడుమల్లి నుంచి చింతూరు ఏజెన్సీ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఘాట్‌ రహదారిలో మలుపు వద్ద బస్సు అదుపుతప్పినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఇదే ప్రాంతంలో ప్రయివేట్ బస్ ప్రమాదం జరిగి 7 గురు మృతి చెందారు.