శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం!
శంషాబాద్, ఆంధ్రప్రభ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో తనిఖీల సందర్భంగా బుల్లెట్‌ను భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
సమాచారం అందుకున్న జీఎంఆర్ ఔట్‌పోస్ట్ పోలీసులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బుల్లెట్ అతడి లగేజీలోకి ఎలా వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. దానిని ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చాడా? లేక అనుకోకుండా లగేజీలోకి చేరిందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
