Building | ప్రైమరీ స్కూల్, హాస్టల్ నిర్మాణం చేపట్టాలని వినతి

Building | ప్రైమరీ స్కూల్, హాస్టల్ నిర్మాణం చేపట్టాలని వినతి

Building | కరిమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని శివనగర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న పాత హాస్టల్ భవనం కారణంగా స్థానిక ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ భవనం ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాథమిక పాఠశాలతో పాటు ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త హాస్టల్ భవనం నిర్మించాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు ఆయన వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం శివనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రాథమిక విద్యా సౌకర్యాలు తక్కువగా ఉండటంతో చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని, ముఖ్యంగా పేద కుటుంబాల పిల్లలు చదువు మధ్యలోనే మానేసే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పాత హాస్టల్ భవనం శిథిలావస్థలో ఉండటంతో ప్రమాదాలకు కూడా ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఈ స్థలంలో ప్రైమరీ స్కూల్‌తో పాటు హాస్టల్ భవనం నిర్మిస్తే శివనగర్‌తో పాటు పరిసర కాలనీలకు చెందిన వివిద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, విద్యాభివృద్ధికి ఇది దోహదపడుతుందని కార్పొరేటర్ తెలిపారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

Leave a Reply