Buddha Venkanna | వైఎస్ మళ్లీ బతికి వచ్చినా..

Buddha Venkanna | వైఎస్ మళ్లీ బతికి వచ్చినా..

Buddha Venkanna | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : దేవతలు, మహా ఋషులు నడిచిన ఏపీని రావణకాష్టంగా మార్చింది జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. వైసీపీ హయాంలో వేలంపేట పెట్టి మరి హత్యలు, దోపిడీలు, దారుణాలను జగన్మోహన్ రెడ్డి చేయించారని, కొన్ని కులాలను టార్గెట్ చేయించి మరి హత్యలు చేయించడం దారుణం అన్నారు. జగన్ పాలనలో అత్యధికంగా అనిచబడింది బీసీలే అన్న ఆయన ప్రస్తుత రాజకీయ ఉనికి కోసమే జగన్ పాకులాడుతున్నాడని ఈ క్రమంలోనే పిన్నెల్లి వంటి రౌడీషీటర్లు హంతకులకు జగన్ వంత పాడుతున్నారని చెప్పారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎంపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మున్సిపల్ ఛైర్మన్ కోసం వేలం పాట పెట్టి దాడులు హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులన్నారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి.. ఇలా రాక్షసులు అంతా కలిసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులు అరెస్టు చేస్తే… ఇది తప్పు, అన్యాయం అని జగన్ మాట్లాడతాడని, ఈ రాష్ట్రంలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని చెప్పారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని పచ్చి బూతులు మాట్లాడిన చరిత్ర మీదన్న అయన పవన్ కళ్యాణ్ సామాజికవర్గం పైనా దుర్మార్గాలకు తెగబడ్డారని గుర్తు చేశారు. మా మీద దాడులు చేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని, జై వైసీపీ అనలేదని తోట చంద్రయ్య పీక కోసి చంపేశారన్నారు. చనిపోవడానికి సిద్దమైన చంద్రయ్య… జై టీడీపీ అని ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అది మా బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అంటే ఉన్న కమిట్ మెంట్ అని తెలిపారు. పిన్నెల్లి బ్రదర్స్ దుర్మార్గాలు చేసి అరెస్టు చేస్తే… కొవ్వొత్తుల ప్రదర్శన చేయమని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జైలుకు వెళ్లి పరామర్శించాలని చెప్పడం దుర్మార్గమన్నారు.

పిన్నెల్లి బ్రదర్స్ ను వెనుకేసుకు వస్తున్న జగన్.. నైజం ఏమిటో ప్రజలు అర్దం చేసుకోవాలన్నారు. ఇద్దరు వ్యక్తులను అత్యంత కిరాతకంగా చంపిన వారిని అరెస్టు చేస్తే.. దుర్మార్గులకు జగన్ సంఘీభావం ప్రకటించారని, ఈ రాష్ట్రంలో జగన్ నాయకత్వాన్ని బలపరచడం అంటే.. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినట్లే నన్నారు. బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులకు ప్రజలు లొంగిపోయి.. మీ పిల్లల భవిష్యత్ ను నాశనం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వారి సమావేశాలు యాత్రలకు కూడా డబ్బులు ఇస్తున్నారని అయినా వెళ్ళవద్దని హితవు పలికారు. ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రం గాడిలో పడుతుందని, మోడీ సహకారంతో చంద్రబాబు పని చేస్తున్నారని గుర్తు చేశారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లు ఈ రాష్ట్రం బాగు కోసం నిత్యం కృషిచేస్తున్నారని, రుషులు యాగం చేస్తుంటే.. రాక్షసులు నాశనం చేసినట్లుగా,… చంద్రబాబు రాష్ట్రాన్ని బాగుచేస్తుంటే.. జగన్ అనే రాక్షసుడు రాష్ట్రాన్ని నాశనం చేయాలని అడ్డంకులు కలిగిస్తున్నాడన్నారు.

జగన్ కు మతి భ్రమించిందని, అసలు మాజీ సీఎంగా ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు సోయ లేదన్నారు. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ లేకపోతే.. అక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు, అక్కడ వారి వల్ల ఎవరికీ మనశ్శాంతి లేదని,. అటువంటి రౌడీలకు జగన్ సంఘీభావం తెలపడం దారుణమన్నారు. మీ అరాచకాలు భరించలేక 11 సీట్లు ఇచ్చారని,ఈసారి 1 సీటే మీకు దిక్కు అన్నారు. మా జిల్లాలో కొడాలి నానీ, పేర్ని నానీలు ఏదేదో వాగుతున్నారని, ఒకరికి గుండె కాయ లేదని, మరొకరికి ఊపిరి తిత్తులు దెబ్బ తిన్నాయన్నారు. ఇటువంటి వారు జగన్ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రగల్భాలు పలకడం నవ్వొస్తుందన్నారు.

వీరు ఆరు నెలలకు కోలుకుని.. జగన్ పక్కన చేరే లోపు జగన్ పరిస్థితి ఏమిటో ఆలోచన చేయండన్నారు. మీరు కాదు కదా.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైయస్సార్ బతికి వచ్చినా.. మళ్లీ జగన్ సీఎం కావడం అనేది కల అని చెప్పారు. ఇప్పుడు ఉన్నది ప్రజా క్షేమం కోరే కూటమి ప్రభుత్వం అని, మీ పగటి కలలు మానండని చెప్పారు. ఇప్పుడు బయటకు వచ్చి మంగమ్మ శపధాలు చేస్తే మీ మాటలు ఎవరూ విశ్వసించరనీ, జగన్ పాలన పోయిన తర్వాత ప్రజలు దీపావళి చేసుకున్నారనీ, ఇప్పుడు జగన్ రెడ్డికి 11 పోయి ఒక్క సీటు మిగలడం ఖాయం అన్నారు. పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లు, దుర్మార్గులను ప్రజలు తరిమి కొట్టాలని, అటువంటి వారిని కాపాడుతున్న జగన్ ను, ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేయాలన్నారు.

Leave a Reply