Buchi babu | పెద్ద ప్లానే వేసాడుగా..

Buchi babu | పెద్ద ప్లానే వేసాడుగా..

Buchi babu | పెద్ది తర్వాత బుచ్చిబాబు ప్లాన్ ఏంటి?
ప్రభాస్ పై బుచ్చిబాబు కన్నేసాడా?
అఖిల్‌తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫిక్సా?
మహేష్ బాబుతో ఉన్న అనుబంధం
పెద్ది హిట్ అయితే గేమ్ ఛేంజ్ అవుతుందా?

Buchi babu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉప్పెన సినిమాతో.. సంచలనం సృష్టించాడు.. తొలి సినిమాతోనే 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమాను అందించాడు. అతనే.. డైరెక్టర్ (Director) బుచ్చిబాబు. రెండో సినిమాకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. పెద్ది అంటూ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కానుంది. మరి.. పెద్ది తర్వాత బుచ్చిబాబు సినిమా ఎవరితో అంటే ఓ వార్త బయటకు వచ్చింది. అలాగే బుచ్చిబాబు టార్గెట్ ఇదే అంటూ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది. ఇంతకీ.. బుచ్చిబాబు టార్గెట్ ఏంటి..?

Buchi babu | అంచనాలు పెంచేసిన పెద్ది..

బుచ్చిబాబు పెద్ది సినిమా కోసం చాలా హోమ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ చేశాడు. ఉప్పెన సినిమా కంప్లీట్ అయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఈ కథ పై వర్క్ చేశాడు. చరణ్‌ (Charan) డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి చరణ్‌ డేట్స్ ఇవ్వడం.. పెద్ది షూటింగ్ కంప్లీట్ అవ్వడం తెలిసిందే. ఫస్ట్ సింగిల్ అండ్ సెకండ్ సింగిల్స్ తో పెద్ది పై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇక పెద్ది గ్లింప్స్ అయితే.. వేరే లెవల్లో ఉందని చెప్పచ్చు. ఈ గ్లింప్స్ వైరల్ అవ్వడంతో పెద్ది సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

Buchi babu

Buchi babu | బుచ్చిబాబు టార్గెట్ ఇదే..

ఇదిలా ఉంటే.. పెద్ది తర్వాత చరణ్‌ సినిమా సుకుమార్ తో ఫిక్స్. మరి.. బుచ్చిబాబు సినిమా ఎవరితో అంటే అక్కినేని అఖిల్ తో అంటూ ప్రచారం జరుగుతుంది. బుచ్చిబాబు తన దగ్గర ఉన్న కథను అఖిల్ కి చెప్పాడని.. ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి. పెద్ది రిలీజ్ (Peddi Release) తర్వాత ఈ క్రేజీ సినిమా పై క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు బుచ్చిబాబు టార్గెట్ గురించి వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. బుచ్చి టార్గెట్ ఏంటంటే.. ప్రభాస్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడట. అనుకోవడమే కాదు.. ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తున్నాడని తెలిసింది.

Buchi babu

Buchi babu | మహేష్, బుచ్చిబాబు..

ఆమధ్య మహేష్‌ బాబు కోసం బుచ్చిబాబు కథ రాస్తున్నాడని కూడా టాక్ వినిపించింది. సుకుమార్ 1 నేనొక్కడినే సినిమా తీసినప్పుడు బుచ్చిబాబు ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అప్పటి నుంచి మహేష్‌ బాబుతో పరిచయం వుంది. అయితే.. బుచ్చిబాబు (Buchi babu) మనసులో ప్రభాస్ ఉన్నాడని.. ఆయనతో సినిమా చేయాలని ఉత్సాహంగా ఉన్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అయితే.. పెద్ది బ్లాక్ బస్టర్ అయితే.. ప్రభాస్ నుంచి పిలుపు రావచ్చు. పిలుపు రాకపోయినా.. బుచ్చిబాబు కథ చెబుతాను అంటే.. ఒప్పుకోవచ్చు. అదేమి కష్టం కాదు. మరి.. బుచ్చిబాబు టార్గెట్ అయితే ఫిక్స్ అయ్యింది. ఎప్పుడు రీచ్ అవుతాడో చూడాలి.

Buchi babu

Leave a Reply