AP |విజయనగరంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దారుణ హత్య
తెర్లాం, ఫిబ్రవరి 11, ఆంధ్ర ప్రభ : మండలంలో నెమలం గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కోనారి. ప్రసాద్ (28) హత్యకు గురయ్యాడు. వివరాల్లోకెళ్తే.. మండలంలో నెమలాం గ్రామానికి చెందిన కోనారి. ప్రసాద్ (28) (ఇలియాస్ అప్పలనాయుడు) బెంగళూరులో ఐబీఎం కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం పెండ్లి సంబంధాల కోసం సొంతూరుకు వచ్చి సోమవారం అర్ధరాత్రి గురైనట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై జి.సాగర్ బాబు, బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు కేసు నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మంగళవారం ఉదయం డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పర్యవేక్షించారు. బొబ్బిలి డి.ఎస్.పి భవ్య రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు తల్లి అప్పమ్మ, తండ్రి సన్యాసిరావు, అక్క స్వాతి రోదనలు మిన్నంటాయి. సంఘటనా స్థలాన్ని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి. వెంకట చిన్నప్పల్ నాయుడు పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని ఆయన తెలిపారు.