Brungi College | ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన శివప్రసాద్
Brungi College | వికారాబాద్, ఆంధ్రప్రభ : మారుతున్న కాలానికి అనుగుణంగా ఆంధ్రప్రభను ఎప్పటికప్పుడు చేస్తూ ముందుకు సాగిస్తున్న ఆంధ్రప్రభ యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నట్టు బృంగి విద్యాసంస్థల డైరెక్టర్ శివప్రసాద్ పేర్కొన్నారు. ఇవాళ బృంగి కళాశాలలో ఆంధ్రప్రభ క్యాలెండర్ ను పీసీ ఇంచార్జ్ ప్యాట రవితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రభ ముందుకు సాగడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రభ మరింత ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

