బీఆర్‌ఎస్‌ శ్రేణులకు అండగా ఉంటా

కార్యకర్తలు అధైర్యపడొద్దు..
ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా:
మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి

నవాబుపేట్, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని, పార్టీ శ్రేణులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. నవాబుపేట్‌ మండల పర్యటనలో భాగంగా ఆయన పార్టీ కార్యకర్తలను కలుసుకుని మాట్లాడారు.

మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన కార్యకర్త యాదయ్య నూతన కారు కొనుగోలు చేసిన సందర్భంగా డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కార్యకర్తలు ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని సూచించారు.

ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరాడాలని కోరారు. కార్యక్రమంలో నర్సింలు తదితరులు పాల్గొన్నారు.