బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ పిలుపు
కడెం, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. కడెం మండల కేంద్రానికి చెందిన దుంపేటి రాజశేఖర్ బుధవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కడెం మండల సీనియర్ నాయకులు ముబారక్ బీన్ మొహమ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూక్య జాన్సన్ నాయక్ రాజశేఖర్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వారి తరఫున నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీపీ ఎం. రాజేశ్వర్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు ఇస్లావత్ గంగన్న, బీఆర్‌ఎస్ సామాజిక మాధ్యమాల అధ్యక్షుడు ఎం.డి. హసీబ్, కొండుకూర్ గ్రామ సర్పంచ్ భీమేష్, బీఆర్‌ఎస్ కొండుకూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
పార్టీ సీనియర్ నాయకులు మామిడిపల్లి రాజేశ్వర్‌గౌడ్, కుర్ర గంగాధర్, కోచనపల్లి నరసయ్య, శనగరపు రాజేశ్వర్, వెంబడి లావణ్య, తిరుపతి, చిట్యాల రవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
