BRS Party | ప్రపంచం తలకిందులైనా ప్రతి ఒక్కరూ సభకు రావాలి : ఎల్కతుర్తిలో హరీశ్ రావు

హ‌నుమ‌కొండ‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రపంచం తలకిందులైన ప్రతి ఒక్కరూ ఎల్కతుర్తి లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు తరలిరావాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాల‌ని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రతిన భూనెందుకు పార్టీ రజ‌తోత్సవ సభకు తరలిరావాలని ఆయన కోరారు. శ‌నివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయ‌న‌ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారీ బహిరంగ సభలు జరిపిన ఘనత బీఆర్ఎస్ కు ఉందన్నారు.

అతిపెద్ద స‌భ‌ల‌కు వ‌రంగ‌ల్ వేదిక‌
అతిపెద్ద సభలకు వరంగల్ వేదిక అయ్యింద‌ని, అందుకే కేసీఆర్ ఇక్కడే రజతోత్సవం నిర్వహించాలని నిర్ణయించార‌ని హ‌రీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ప్రసంగం విన‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ ఆస‌క్తిగా ఇక్క‌డ‌కు వ‌స్తున్నార‌న్నారు. ఆత్మహత్యల తెలంగాణను అన్నపూర్ణగా మార్చండి కేసీఆర్ అన్నారు. ఏడాదిన్నర కాలంలో పాలు, నీళ్ల తేడా తెలిసింద‌ని, కొత్త పథకాలు లేవు, ఉన్న పథకాలు బంద్ అయ్యాయ‌ని చెప్పారు. కాంగ్రెస్ శృతి లేని గతి లేని ప్రభుత్వమయింద‌న్నారు. వరంగల్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నార‌ని, స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు అందరూ సహకరించాలని ఆయ‌న కోరారు.

Leave a Reply