ఢిల్లీకి బయల్దేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఢిల్లీకి బయల్దేరారు. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ వాణిదేవి ఢిల్లీకి వెళ్లారు.
రేపు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులను కలిసి అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేయనున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను కమిషన్ల దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
