బీఆర్‌ఎస్‌ నిరసన కార్యక్రమానికి తరలిన నాయకులు

జైనూర్/సిర్పూర్‌ (యు), ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై 1,000 రోజుల పాలనలో జరిగిన అన్యాయాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన శ్వేతపత్రం విడుదల, నిరసన కార్యక్రమానికి జైనూర్‌, సిర్పూర్‌ (యు) మండలాల నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు తరలివెళ్లారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు నాయకులు బయలుదేరారు.

తరలివెళ్లిన వారిలో ఆసిఫాబాద్‌ మాజీ గ్రంథాలయ చైర్మన్‌ కనక యాదవరావు, బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు ఇంతియాజ్‌ లాల్‌, తొడసం ధర్మారావు, జైనూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆత్రం భగవంతరావు, సిర్పూర్‌ (యు) మాజీ ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి, బాండేర్‌ సర్పంచ్‌ కుమ్ర భీమ్రావు, జైనూర్‌ మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు మడావి భీమ్రావు, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు కుమ్ర భగవంతరావుతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.