బీఆర్ఎస్ నేతలు సంతాపం
సంగారెడ్డి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల(Gummadila) మున్సిపాలిటీ పరిధి దోమడుగుకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సంజీవని మల్లికార్జున గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ(BRS party) రాష్ట్ర నాయకులు, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి , మాజీ జెడ్పీటసీ కొలన్ బాల్ రెడ్డి(Kolan Bal Reddy), ఉద్యమకారుడు జిన్నారం వెంకటేష్ గౌడ్ తదితరులు గ్రామానికి చేరుకుని పార్దివ దేహానికి పూలమాలలు సమర్పించి సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మల్లికార్జున గౌడ్(Mallikarjuna Goud) సేవలు మరువలేనివన్నారు. వారితో పాటు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, నాయికోటి రాజేష్(Naikoti Rajesh), దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, సంజీవరెడ్డి, చక్రపాణి, గోపాల్,మల్లేష్ గౌడ్, మంగయ్య,నరహరి, దర్గా శ్రీనివాస్, కుమ్మరి ఆంజనేయులు, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ, శాంతవర్మరెడ్డి, గోపి, నర్సింగారావు ఉన్నారు.