రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేసిన బీఆర్ఎస్ నేత
మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : మిర్యాలగూడ పట్టణానికి చెందిన జర్నలిస్టు(Journalist) దండ భాస్కర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్నబీఆర్ఎస్(BRS ) మాజీ ఎమ్మెల్యే(former BRS MLA) భాస్కరరావు కుమారుడు, బీఆర్ఎస్ యువజన నాయకుడు నల్లమోతు సిద్ధార్థ మిర్యాలగూడ(Miryalaguda)లో ఉన్న జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం రూ.50 వేలు అందజేశారు. అంతకుముందు జర్నలిస్టు భాస్కర్ చిత్రపటాని(Chitrapatani)కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను ఓదార్చారు.