BRS flag | బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.
BRS flag | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామంలో బీఆర్ఎస్ జెండా(BRS flag) ఎగరడం ఖాయమని ఆపార్టీ సీనియర్ నాయకులు చిర్ర శ్రీనివాస్ అన్నారు. పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి యాసం సంధ్య రమేష్, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
గత దశాబ్ద కాలం నుండి నైనాల ప్రజలకు అండగా వుంటూ గ్రామ అభివృద్ధి(Village development)కి పాటు పడ్డామన్నారు. ఎలాంటి లాబాపేక్ష లేకుండా ప్రజలకు, పార్టీలకు అతీతంగా నిస్వార్ధంగా సేవలు చేశామన్నారు. సర్పంచ్ గా యాసం సంధ్య రమేష్ తోపాటు అన్ని వార్డుల అభ్యర్థులను అధిక మెజారిటితో గెలిపించాలని ప్రజలను కొరారు.

