ఎల్లారెడ్డిపేట, ఆంధ్రప్రభ : కాళేశ్వరం లేకుంటే లక్షలాది ఎకరాలకు నీళ్లు ఎక్కడివి అనే బ్యానర్లు వెలిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ముఖ్య కూడలిలో బీఆర్ఎస్
ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
కాళేశ్వరంతో శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్, మల్కపేట రిజర్వాయర్, అన్నపూర్ణ రిజర్వాయర్, చిత్రాలతో 9 10 ప్యాకేజీలకు చేసిన ఖర్చుతోపాటు 1,11,150 ఎకరాలకు సాగునీరు అందుతుంది అని అందులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వయిరీ కోరిన నేపథ్యంలో వెలసిన ఈ ఫ్లెక్సీలు వల్ల కాళేశ్వరం పై రచ్చబండ స్థాయిలో చర్చ జరిగేలా చేశాయి. చూడాలి మరి ఈ ఫ్లెక్సీల చర్చ ఎంతవరకు జరుగుతుంది? ఎటు దారితీస్తుంది? ఎవరికి మేలు చేకూరుస్తుంది?

