BRS | బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలవాలి

BRS | బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలవాలి
- శబరిమలలో కస్తూరి రాజేష్ పాదయాత్ర
BRS | చెన్నూరు, ఆంధ్రప్రభ : రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని.. చెన్నూరులో ఎమ్మెల్యేగా బాల్క సుమన్ గెలవాలని ఆకాంక్షిస్తూ చెన్నూర్ మండలం దుగ్నేపల్లి గ్రామానికి చెందిన కస్తూరి రాజేష్ (rajesh) శబరిమల యాత్రలో భాగంగా 65 కిలోమీటర్ల పాదయాత్రను ఫ్లెక్సీ చేతబూని భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. అయ్యప్ప స్వామి దర్శనాన్ని లక్ష్యంగా పెట్టుకుని సంప్రదాయ నియమాలు పాటిస్తూ, కఠినమైన అరణ్య మార్గాల్లో కాలినడకన ప్రయాణం చేస్తూ ఈ పాదయాత్రను నిర్వహించారు.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత భక్తితో పాటు తెలంగాణ భవిష్యత్తుపై ఉన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేసిన కేసీఆర్ నాయకత్వం మళ్లీ రాష్ట్రానికి అవసరమని, చెన్నూరులో ప్రజల హృదయాల్లో నిలిచిన బల్క సుమన్ (Suman) తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలని అయ్యప్ప స్వామిని ప్రార్థించినట్లు కస్తూరి రాజేష్ తెలిపారు. ఈ పాదయాత్ర ఆయన ఆధ్యాత్మిక విశ్వాసానికి మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యంపై ఉన్న ఆశయానికి ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమం దుగ్నేపల్లి గ్రామంతో పాటు చెన్నూర్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, బీఆర్‌ఎస్ శ్రేణులు కస్తూరి రాజేష్‌ను అభినందిస్తూ, ఆయన సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు.
