తెలంగాణ విద్యార్థుల ప్ర‌తిభ‌

సీబీఎస్ఈ జాతీయ విలువిద్య పోటీలలో కాంస్యం

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : పంజాబ్‌లో జీసీఎం కాన్వెంట్ స్కూల్‌లో జ‌రిగిన సీబీఎస్ఈ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం, డీపీఎస్ స్కూల్ నాదర్గుల్‌కు చెందిన ఆశ్రిత్ కశ్యప్, ధన్వంత్ గణేష్, కె.కరణ్ అండర్-17 బాలుర జట్టు రిజ‌ర్వు విభాగంలో కోచ్ నూతన్ కుమార్ ఆధ్వ‌ర్యంలో కాంస్య పతకం గెల్చుకున్నారు. 80 మంది పోటీ పడగా బంగారం పతకం హర్యానాకు, రజత పతకం పంజాబ్‌కు దక్కాయి. ఆశ్రిత్, ధన్వంత్, కరణ్ ప్ర‌తిభ‌ను తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్, డీపీఎస్ నాదర్‌గుల్ పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశాయి. వారి కఠోర సాధన, అంకితభావానికి ఇది నిదర్శనం అన్నారు.

Leave a Reply