Breaking News | కొడాలి నానికి గుండెపోటు

హైద్రాబాద్ – వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా , పార్టీ నేతలు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు ప్రార్థనలు చేస్తున్నారు.

Leave a Reply