BREAKING | ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే !

  • అభ్యర్థుల లాగిన్‌లో స్కోర్‌ కార్డులు..
  • అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ టెట్‌–జూన్‌ 2026 పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జూలై 5 నుంచి 16వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు టెట్‌ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ లాగిన్‌ వివరాలను నమోదు చేసి స్కోర్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫలితాల కోసం కింది అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

టెట్‌ ఫలితాల కోసం :
AP TET Results – అధికారిక వెబ్‌సైట్‌