దుర్గుణాలను తొలగించడము
మనము మన శరీ రాలను సరైన విధంగా ఉపయోగించని క్షణం నుండి మనం మన ఆధ్యాత్మిక అంచుల నుండి క్రిందకు దిగుతూ వచ్చాము. మనం ఆత్మలము, మనం ఈ భౌతిక శరీరాలతో జీవన్మరణ చక్రాన్ని ప్రారంభించాము. చివరకు, మన శరీరాన్ని వికారాలకు ఉపయోగించాము, ఆ క్షణం నుండి ఆత్మలో ఎంతో మలినం
పేరుకుపోయింది. ఈ విధంగా మనలోని శాంతి, సంతోషము, ప్రేమ, పవిత్రతను మనం పోగొట్టుకున్నాము. ఈ జన్మలో, అలాగే గత జన్మలలో ఏవైతే మనల్ని దిగజార్చాయో అవి ఆత్మ లోపలకు చొచ్చుకొని పోయాయి. వాటిని తొలగించడం అంత సామాన్యమైన విషయము కాదు.
పొగాకు, సారా, కామము వంటి ప్రత్యక్ష దుర్గుణాలపై ఆధారపడటము నుండి మన ప్రయత్నం ప్రారంభమవుతుంది. కానీ అహంకారం వ ంటి సూక్ష్మమైన దుర్గుణాలను తొలగించడంలోనే అసలైన కృషి అవసరము. మనలోని సూక్ష్మ వికారాలు మనల్ని భగవంతుని సంతానముగా భావించనివ్వవు.
–బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి