దుర్గగుడి చైర్మన్ గా బొర్రా గాంధీ…

- ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత స్నేహితుడిగా ముద్ర
- ఎన్టీఆర్ కీలక అభిమానిగా గుర్తింపు
- క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఎదిగిన నేత
ఆంధ్రప్రభ, విజయవాడ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం చైర్మన్ గా బొర్రా గాంధీ కి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ప్రముఖ సినీ నటుడు హిందూపూర్ శాసనసభ్యుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన బొర్రా గాంధీ పెనమలూరు నియోజకవర్గం లో కీలక తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నారు.
గతంలో పెనమలూరు ఎంపీపీగా ఆయన భార్య పదవిని అలంకరించారు. మరో రెండు రోజుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముందు దుర్గ గుడి చైర్మన్ గా బొర్రాగాంధీ ని ఎంపిక చేయడం పట్ల కూటమి నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

