Sangareddy | జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం.. అంగరంగ వైభోగం !!

జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో జ‌గ్గారెడ్డి సతీమణి నిర్మల, కుమార్తె జయా రెడ్డి కూడా పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు.

దేవతా మూర్తులకు ట్రాక్టర్లపై భారీ ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. ఈ ఊరేగింపులో భోగి నిషా క్రాంతి చేసిన ప్రత్యేక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే, కళాకారుల నృత్యాలు, డప్పుల సప్పుళ్లు ఉత్సవాలకు మరింత శోభను తెచ్చాయి. ప్రజలు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave a Reply