Shamshabad Airport: బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అలర్ట్..

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ‌: అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపుతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport)లో అధికారులు తీవ్ర తీవ్ర అలర్ట్ ప్రకటించారు.

విమానంలో బాంబు ఉందంటూ ఒక విద్యార్థిని చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు.

ఐసోలేషన్ బేలో తనిఖీలు..

ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని వెంటనే ప్రత్యేక ‘ఐసోలేషన్ బే’కు తరలించారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి విమానంలో అంగుళం అంగుళం విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సంఘటనతో ఎయిర్‌పోర్ట్‌లో కొంతసేపు తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పూర్తి తనిఖీల అనంతరం అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.