ఓటుతో ఆశీర్వదించండి.. పోటీతో అభివృద్ధి చేస్తా

  • సర్పంచ్ అభ్యర్థి జోగిని శ్రీలత ఎల్లయ్య

సదాశివనగర్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ బలపరిచిన సదాశివనగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జోగిని శ్రీలత ఎల్లయ్యను గ్రామ ప్రజలు ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. విద్యావంతురాలైన జోగిని శ్రీలత ఎల్లయ్యకు సర్పంచిగా అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. సదాశివనగర్ గ్రామాన్ని పోటితో అన్ని విధాల అభివృద్ధి చేయడమే సంకల్పంగా పెట్టుకొని ముందుకు వస్తున్నారు.

బతుకమ్మ పండుగలో ఆడపడుచులకు అణువుగా కొత్త చెరువు వద్ద మెట్ల నిర్మాణం, ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా వైద్య శిబిరం నిర్వహణ, అన్ని వీధులలో డ్రైనేజీ నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణం,ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను సొంత డబ్బులతో పూర్తి చేయడం, తాగునీటి సమస్యలకు సత్వర పరిష్కారం, పచ్చదనం పరిశుభ్రతకు ఎల్లవేళల కృషి, వీధి దీపాల ఏర్పాటు, బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం, ఆదివారం నిర్వహించే అంగడికి వసతులు కల్పించడం, సులువైన పార్కింగ్, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం వంటి అభివృద్ధి పనులు చేపట్టడానికి సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారం సాగుతుంది. సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు.

Leave a Reply