ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తా!

  • ప్రచారంలో దూసుకుపోతున్న సర్పంచ్ అభ్యర్థి

తిర్యాణి, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నైతం రామచందర్ గ్రామంలో విస్తృతంగా ఇంటింటా ప్రచారం నిర్వహించి, ఓట్లను అభ్యర్థించారు.

ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామానికి ప్రతి ఇంటికి ఉచిత మినరల్ వాటర్, మురుగు కాలువల నీటి నిర్వహణ, దేవాలయాల అభివృద్ధి, సిసి రోడ్ల నిర్మాణం, దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అంకం గౌరయ్య, పెందోర్ ధర్మం, కూన సురేష్, బొల్లం మల్లేష్, రాజు కునుకుంట్ల సత్యం, తట్ల చిన్నయ్య, దాసరి వెంకటేశం సహా గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply