ప్రచారంలో దూసుకుపోతున్న 10వ వార్డు బిజెపి అభ్యర్థి

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ 10వ వార్డు బిజెపి అభ్యర్థి గర్రెపల్లి శాంతరాణి వెంకట నర్సయ్య ప్రచారంలో దూసుకుపోతున్నారు. 10వ వార్డులోని గడప గడపకు మహిళా అనుచరుణులతో కలిసి ఓటర్లను కలుస్తూ వార్డు ప్రజల అండదండలు చూపిస్తూ కమలం గుర్తుకు ఓటువేయాలని కోరుతున్నారు. తనను ప్రజలు గెలిపిస్తే ప్రధాని మోదీ అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూస్తానని, వార్డు లో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కరానికి మున్సిపల్ సమావేశాల్లో ప్రజల పక్షాన గళం విప్పి సమస్యలు పరిస్కారిస్తానని హామీ ఇస్తున్నారు. ప్రజలు వార్డు ఆడపడుచుల తో మమేకమై సేవలు అందించే అందుకు కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వాదించాలని కోరారు.
