BJP | మృతికి కారకులను వెంటనే అరెస్ట్ చేయాలి
బీజేపీ డిమాండ్
BJP | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారకులైన దోషులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్య ధోరణి ప్రదరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆరోపించారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీ మండల అధ్యక్షుడు మృతి చెంది రెండు నెలలు గడుస్తున్నా.. పోలీసులు దోషులను ఎందుకు పట్టుకోలేక పోతున్నారని ప్రశ్నించారు.
నిందితులు హైకోర్టు నుంచి తెచ్చుకున్న యాంటీ సేఫ్టీ బెల్ ను రద్దు చేసినప్పటికి పోలీసులు అరెస్ట్ చేయకపోవడంతో నిందితులు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారని ఆరోపించారు. పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యాహరించడం తో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయాలని కుటుంబ సభ్యులు రోడ్ పై బైఠాయించి ఆందోళన చెస్తే ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడం నిందితులకు సహకరిస్తూ.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా నిందితులను అరెస్ట్ చేయకపొతే బీజేపీ ఆధ్వర్యంలో సీపీ, డీసీపీ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు.

