IndiGo Flight | విమానాన్ని ఢీకొన్న పక్షి…
IndiGo Flight | విమానాన్ని ఢీకొన్న పక్షి…
ముందు భాగం స్వల్పంగా ధ్వంసం
IndiGo Flight | హైదరాబాద్, అక్టోబర్ 4 (ఆంధ్రప్రభ): శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. ఇండిగోకు చెందిన 6E352 విమానం పుణె–హైదరాబాద్ మార్గంలో నడుస్తోంది. ఈ విమాన సర్వీసు ఈ మార్గంలో సాధారణంగా నడుస్తున్నట్లు విమాన రాకపోకల వివరాలు కూడా చూపిస్తున్నాయి.
పక్షి ఢీకొనడంతో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
విమానం ల్యాండ్ అయిన అనంతరం నిపుణులు దానిని క్షుణ్ణంగా పరిశీలించారు. పక్షి ఢీకొన్న ప్రభావం, విమానం ముందు భాగానికి జరిగిన నష్టం తదితర అంశాలను తనిఖీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో ప్రయాణికుల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ.. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
