Bigg Boss Telugu 10 Captaincy Task-E10 | పవర్‌ ఆఫ్‌ పీపుల్‌లో ఎనిమిది మందితో మొదలైన పోరు.. డామినేషన్‌, ఎమోషనల్‌ గేమ్‌, వ్యూహాలతో హౌస్‌లో హీట్ !

  • బిగ్‌బాస్‌లో కెప్టెన్సీ టాస్క్‌.. అసలు గేమ్‌ ఇక్కడే షురూ!
  • పవర్‌ ఆఫ్‌ పీపుల్‌లో ఎనిమిది మంది పోటీ.. బెలూన్లతో బిగ్‌ ఫైట్‌..
  • మాటల యుద్ధంతో హౌస్‌ హీటెక్కింది!
  • ఫైన‌ల్‌కు చేరిన ఝాన్సీ, ఆమ‌న్‌
  • ఝాన్సీ కోరిక తీరుతుందా?

Bigg Boss Telugu 10 Captaincy Task-E10 | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, సినిమా ప్ర‌తినిధి : బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో కెప్టెన్సీ రేసు ఆసక్తికర మలుపులు తిరిగింది. ప్రేక్ష‌కులు ఇచ్చిన అవ‌కాశంతో కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన ఎనిమిది మంది.. ఇప్పుడు కెప్టెన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పోటీ పడాల్సి వచ్చింది. ‘పవర్‌ ఆఫ్‌ పీపుల్‌’ పేరుతో బిగ్‌బాస్‌ ఇచ్చిన ఈ టాస్క్‌లో స్పెల్లింగ్‌ రాయడం, బెలూన్లు పగలగొట్టడం మాత్రమే గేమ్‌గా కనిపించినా.. అసలు పోటీ మాత్రం కంటెస్టెంట్ల మధ్య ఉన్న గ్రూపులు, అభిప్రాయాలు, ఎమోషన్స్‌, వ్యూహాల చుట్టూనే తిరిగింది.

ఎనిమిది మందితో మొదలైన రేసు

కెప్టెన్సీ కంటెండర్లుగా త్రిగుణ్‌, దేబ్‌జానీ, అమన్‌, షాలిని, ముఖేశ్‌, రోహిత్‌, ఝాన్సీ, రాంప్రసాద్‌ ఎంపికయ్యారు. వీరికి బిగ్‌బాస్‌ స్పెల్లింగ్‌ టాస్క్‌ ఇచ్చారు. సరైన స్పెల్లింగ్‌ రాసిన కంటెస్టెంట్‌కు మరో కంటెస్టెంట్‌ బెలూన్‌ను పగలగొట్టి.. రేసు నుంచి కంటెస్టుల‌ను తప్పించే అవకాశం దక్కింది. ఈ టాస్క్‌కు వర్షిణి సంచాలకురాలిగా వ్యవహరించింది. దీంతో ఆటలో ఆమె నిర్ణయాలు కూడా కీలకంగా మారాయి.

త్రిగుణ్‌ టార్గెట్‌.. డామినేషన్‌పై చర్చ

టాస్క్‌ మొదలైన వెంటనే త్రిగుణ్‌ చుట్టూ చర్చ మొదలైంది. త్రిగుణ్‌ ప్రతి విషయానికీ త్వరగా స్పందిస్తాడని, కెప్టెన్‌ అంటే కామ్‌ అండ్‌ కంపోజ్‌గా ఉండాలని దేబ్‌జానీ అభిప్రాయపడింది. ముఖేశ్‌ కూడా త్రిగుణ్‌లో డామినేషన్‌ ఉందని, అయితే అది సరైన విధంగా లేదని పాయింట్‌ చేశాడు. మరోవైపు త్రిగుణ్‌ కూడా తన వ్యూహంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు.

మొదటి రౌండ్‌లోనే త్రిగుణ్‌ నాలుగు బెలూన్లను కోల్పోవడంతో కెప్టెన్సీ రేసు నుంచి బయటకు వచ్చాడు. దీంతో మొదటి నుంచే ఆయ‌న‌పై వచ్చిన ఆరోపణలకు గేమ్‌ ఫలితం మరో కోణాన్ని తీసుకొచ్చింది.

రోహిత్‌ వర్సెస్‌ ఝాన్సీ.. మాటల మంటలు

రోహిత్‌ విషయంలో ఝాన్సీ చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో మరో చర్చకు దారితీశాయి. డే వన్‌ నుంచి కొంతమంది కంటెస్టెంట్లతోనే రోహిత్‌ ఎక్కువగా ఉంటున్నాడని ఝాన్సీ ప్రశ్నించింది.

దీనిపై రోహిత్‌ కూడా ‘నేనా వాళ్లను కూర్చోబెట్టుకున్నాను?’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. టాస్క్‌లో ఎవరిని తొలగించాలన్నది వ్యక్తిగత సంబంధాల ఆధారంగా కాకుండా గేమ్‌ వ్యూహం ప్రకారం నిర్ణయించాలని రాంప్రసాద్‌ సూచించడం కూడా ఆసక్తికరంగా మారింది.

చివరికి ఝాన్సీ చేతిలో రోహిత్‌ చివరి బెలూన్‌ కూడా పేలడంతో అతడు కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.

త్రిగుణ్‌ పేరు మళ్లీ తెరపైకి..

రోహిత్‌, ఝాన్సీ మధ్య వివాదంలో త్రిగుణ్‌ కూడా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. దీంతో రోహిత్‌.. త్రిగుణ్‌ను ఉద్దేశించి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశాడు. అంతేకాదు.. త్రిగుణ్‌ తనను, షాలినిని టార్గెట్‌ చేయాలని సూచించాడంటూ రోహిత్‌ చేసిన వ్యాఖ్యలకు అక్కడున్నవారి నుంచి స్పందన వచ్చింది. దీంతో కెప్టెన్సీ టాస్క్‌ కేవలం బెలూన్ల ఆట కాకుండా.. గతంలో ఏర్పడిన సమీకరణాలు బయటకు తీసుకొచ్చే వేదికగా మారింది.

‘ఎమోషనల్‌ గేమ్‌’పై రచ్చ

రాంప్రసాద్‌, షాలిని మధ్య కూడా టాస్క్‌ సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ‘మా చెల్లి’ అంటూ రాంప్రసాద్‌తో ఉన్న అనుబంధాన్ని కొందరు గ్రూప్‌ గేమ్‌గా చూస్తున్నారని షాలిని వ్యాఖ్యానించింది.

దీనిపై రాంప్రసాద్‌ తాను ఎమోషన్స్‌తోనే ఆడతానని చెప్పడం మరో చర్చకు దారితీసింది. దేబ్‌జానీని కూడా తన చివరి బెలూన్‌ పగలగొట్టమని రాంప్రసాద్‌ కోరడం టాస్క్‌కు మరింత ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చింది.

ఇదే సమయంలో ‘నాకు ఎవరూ లేరు.. నేను ఒంటరిగానే ఆడతా’ అంటూ వంశీ చేసిన వ్యాఖ్యలు కూడా హౌస్‌లో చర్చకు వచ్చాయి. అంటే.. టాస్క్‌లో బెలూన్లు ఒక్కొక్కటిగా పేలుతున్న కొద్దీ కంటెస్టెంట్ల మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు కూడా బయటపడుతున్నాయన్నమాట.

దేబ్‌జానీకి భాషే సమస్యగా మారిందా?

దేబ్‌జానీ విషయంలో అమన్‌ చెప్పిన కారణం కూడా గమనించదగ్గదే. భాష విషయంలో అపార్థాలు జరిగే అవకాశం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. ఇది కేవలం టాస్క్‌లో ఒక కంటెస్టెంట్‌ను తొలగించడానికి చెప్పిన కారణమా? లేక హౌస్‌లో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ గురించి వస్తున్న చర్చకు కొనసాగింపా? అనేది ఆసక్తికరంగా మారింది. దేబ్‌జానీ కూడా నాలుగు బెలూన్లు కోల్పోవడంతో కెప్టెన్సీ రేసు నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత షాలిని కూడా రేసు నుంచి తప్పుకోవడంతో పోటీ చివరకు ఝాన్సీ, అమన్‌ మధ్యకు చేరింది.

సంచాలకురాలిగా వర్షిణి నిర్ణయాలు.. వివాదాస్పదంగా మారాయా?

ఈ టాస్క్‌లో వర్షిణి సంచాలకురాలిగా ఉండటం మరో కీలక అంశం. ఒక రౌండ్‌లో షాలిని సరైన విధంగా ఆడిందని భావించినప్పటికీ.. వర్షిణి ఝాన్సీకి అవకాశం ఇవ్వడంపై షాలిని ప్రశ్నించింది. ‘సంచాలకురాలిగా నా ఇష్టం’ అంటూ వర్షిణి స్పందించడంతో వాదన మరింత పెరిగింది. మరో సందర్భంలో బజర్‌ మోగిన తర్వాత ముఖేశ్‌ స్పెల్లింగ్‌ రాశాడంటూ హౌస్‌లోని కంటెస్టెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ముఖేశ్‌ను ఆటలో కొనసాగించడంతో సంచాలకురాలి నిర్ణయంపై కూడా చర్చ మొదలైంది. అంటే.. టాస్క్‌లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనే దానికంటే నిర్ణయాలు ఎలా తీసుకున్నారు? వాటిని కంటెస్టెంట్లు ఎలా స్వీకరించారు? అన్నదే ప్రధాన చర్చగా మారింది.

అసలు కెప్టెన్‌ ఎవరు?.. ఝాన్సీ కోరిక తీరుతుందా?

ఎనిమిది మందితో మొదలైన కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌, రోహిత్‌, దేబ్‌జానీ, షాలిని తదితరులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. చివరికి ఝాన్సీ, అమన్‌ మాత్రమే మిగిలారు. ఇక అసలు కెప్టెన్సీ పోరులో ఈ ఇద్దరిలో ఎవరు పైచేయి సాధించారు? మొదటి కెప్టెన్‌గా ఎవరు నిలిచారు? టాస్క్‌లో ఎవరెవరు ఎవరిని టార్గెట్‌ చేశారు? ఎవరెవరి వ్యూహాలు ఫలించాయి? అన్నది తదుపరి ఎపిసోడ్‌లో మరింత స్పష్టమవుతుంది. మొద‌టి కెప్టెన్సీ అవ్వాల‌న్న కోరిక ఉన్న‌ట్లు ఝాన్సీ చెప్పింది. మిగిలిన ఇద్ద‌రిలో ఝాన్సీ ఫైన‌ల్‌కు చేరుకుంది. అయితే ఝాన్సీ కోరిక తీరుతుందా? అన్న‌ది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశం.