Bigg Boss-E10-Debjani vs Mukhes | హలో.. దేబ్‌జానీ నీకు వర్షిణిలా కనిపిస్తుందా?..అవునులే ఆ అమ్మాయితో పూల్‌లో దిగ‌వు క‌దా!

  • బిగ్‌బాస్‌లో ముకేశ్‌–దేబ్‌జానీ మధ్య ‘పూల్‌’ పంచాయితీ.. వర్షిణి పేరుతో రచ్చ!
  • ‘నన్ను వదిలేసి వేరే అమ్మాయితో ఎలా?’ అంటూ ముకేశ్‌పై దేబ్జానీ అలక..
  • రామ్‌ ప్రసాద్‌ ఎంట్రీతో నవ్వులే నవ్వులు!

Bigg Boss-E10-Debjani vs Mukhes | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, సినిమా ప్ర‌తినిధి : బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో రోజురోజుకూ కంటెస్టెంట్ల మధ్య సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓ వైపు టాస్కులు, మరోవైపు గొడవలు.. ఇంకోవైపు క్యూట్‌ లవ్‌ ట్రాక్స్‌తో హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ లేకుండా పోతోంది. ముఖ్యంగా ముకేశ్‌ గౌడ–దేబ్‌జానీ మధ్య సాగుతున్న సరదా వ్యవహారం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ ఎపిసోడ్‌లో నవ్వులు పూయించింది.

స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గర ముకేశ్‌, వర్షిణి సరదాగా గడిపారు. ఆ తర్వాత వాష్‌రూమ్‌ దగ్గరకు వచ్చిన ముకేశ్‌.. అక్కడ ఉన్న దేబ్జానీని చూసి పొరపాటున ఆమె పేరుకు బదులుగా ‘వర్షిణి’ అని పిలిచాడు. అంతే.. దేబ్‌జానీకి చిర్రెత్తుకొచ్చింది. ‘హలో.. దేబ్ జానీ నీకు వర్షిణిలా కనిపిస్తుందా? నువ్వు నా దగ్గరకు రావద్దు’ అంటూ ముకేశ్‌పై ఫైర్‌ అయింది. తాను పొరపాటున అలా పిలిచానని ముకేశ్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. దేబ్‌జానీ మాత్రం అంత ఈజీగా కూల్‌ కాలేదు.

‘నాగ్‌ సార్‌ ముందే చెప్పా కదా!’

నాకు ముకేశ్‌పై ఉన్న ఇష్టాన్ని గత వీకెండ్‌లో హోస్ట్‌ నాగార్జున ముందే చెప్పిన విషయాన్ని దేబ్‌జానీ మరోసారి గుర్తుచేసింది. ‘నేను నాగ్‌ సార్‌ ముందే నీపై నా ఇష్టాన్ని చెప్పాను కదా’ అంటూ ముకేశ్‌ను నిలదీసింది. దీంతో అప్పటివరకు సరదాగా సాగుతున్న సీన్‌ కాస్తా క్యూట్‌ అలకగా మారిపోయింది. అంతేకాదు.. వర్షిణితో కలిసి పూల్‌లో గడిపిన విషయాన్ని కూడా దేబ్‌జానీ ప్రస్తావించింది. ఇంట్లో అందరూ కలిసి ఉన్నప్పటికీ.. ముకేశ్‌ వేరే అమ్మాయితో పూల్‌లోకి దిగడంపై నాకు ఎందుకు నచ్చలేదో తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చింది.

‘నేను త్రిగుణ్‌కు కాఫీ మాత్రమే ఇచ్చా!’

ఇక్కడే దేబ్‌జానీ మరో ఆసక్తికరమైన పోలిక తీసుకొచ్చింది. ‘నేను త్రిగుణ్‌కు కేవలం కాఫీ మాత్రమే ఇచ్చాను. నువ్వు మాత్రం పూల్‌లోకి దిగావ్‌’ అంటూ ముకేశ్‌ను ఆటపట్టించింది. అంతటితో ఆగకుండా.. కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చిన తర్వాత తాను కూడా వేరే వాళ్లతో పూల్‌లో ఉంటానని, అప్పుడు తన బాధ ఏమిటో ముకేశ్‌కు తెలుస్తుందని సరదాగా హెచ్చరించింది. దీంతో ముకేశ్‌ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు. కానీ అలక మాత్రం కాసేపు కొనసాగింది.

మధ్యలో రామ్‌ ప్రసాద్‌.. సీన్‌ మొత్తం కామెడీ!

ముకేశ్‌, దేబ్‌జానీ మధ్య జరుగుతున్న వాద‌న‌లోకి కమెడియన్‌ రామ్‌ ప్రసాద్‌ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఇద్దరి మధ్య గొడవను మరింత ఫన్నీగా మార్చేశాడు. ‘మా చెల్లి అన్యాయం చేస్తుందని తెలుసు కానీ.. వీడు మా చెల్లికే అన్యాయం చేస్తున్నాడు’ అంటూ ముకేశ్‌పై సెటైర్‌ వేయడంతో అక్కడ నవ్వులు పూశాయి. అదే సమయంలో వర్షిణి అక్కడికి రావడంతో దేబ్‌జానీ మరోసారి తన అలకను బయటపెట్టింది. దీంతో ఈ చిన్న సన్నివేశం కాస్తా హౌస్‌లోని అందరినీ ఎంటర్‌టైన్‌ చేసే కామెడీ సీన్‌గా మారిపోయింది.

లవ్‌ ట్రాక్‌నా?

ముకేశ్‌, దేబ్జానీ మధ్య ఇప్పటికే మంచి సాన్నిహిత్యం కనిపిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య జరుగుతున్న సరదా సంభాషణలు, అలకలు, జెలసీ సీన్లు మాత్రం హౌస్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ఆమెకు ముకేశ్‌పై ఉన్న ఇష్టాన్ని దేబ్‌జానీ బహిరంగంగానే చెప్పడంతో.. ముకేశ్‌ ఇతర అమ్మాయిలతో క్లోజ్‌గా ఉన్న సందర్భాల్లో ఆమె స్పందన కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఇది నిజంగా లవ్‌ ట్రాక్‌గా మారుతుందా? లేక బిగ్‌బాస్‌ హౌస్‌లో పుట్టిన ఓ క్యూట్‌ బాండింగ్‌గానే మిగిలిపోతుందా? అనేది ముందు రోజుల్లో చూడాల్సిందే.