Bigg Boss E 4 | మహా పరీక్ష.. మహా ఫెయిల్! హై రిష్క్‌లో ఇద్దరు!
Bigg Boss E 4 | మహా పరీక్ష.. మహా ఫెయిల్! హై రిష్క్‌లో ఇద్దరు!
- రిష్క్‌లో రామ్ ప్రసాద్, చరణ్
- రోహిత్–త్రిగుణ్ మధ్య ముదిరిన రచ్చ
- మ్యాజిక్ పవర్ ప్రయోగించిన శాలిని!.. బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త ట్విస్ట్
బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్లో ‘మహా పరీక్ష’ మరింత ఉత్కంఠగా మారుతోంది. రామ్‌ప్రసాద్‌కు చేజారిన లీడర్ పదవి.. ఇక నుంచి దెబ్జానీ లీడర్.. కంటెస్టుల మధ్య పనుల కేటాయింపు విషయంలో విభేదాలు తలెత్తుతున్నాయి. శాలిని తన మ్యాజిక్ కీ పవర్‌ను ఉపయోగించి వాష్‌రూమ్ బాధ్యతను వర్షిణికి బదిలీ చేసింది. వర్షిణి ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించింది. మరోవైపు దెబ్జానీ తమ టీమ్ వ్యూహంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎపిసోడ్ చివర్లో రోహిత్, త్రిగుణ్ మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. రామ్ ప్రసాద్, చరణ్ హైరిస్క్ జోన్‌లో ఉండటంతో మహా పరీక్షలో ఎవరి వ్యూహం ఫలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Bigg Boss E 4 | ఆంధ్రప్రభ వెబ్, హైదరాబాద్ : బిగ్‌బాస్‌లో కంటెస్టులు ఒకరి కోసం ఒకరు తెలుసుకోకముందే చిచ్చు పెట్టడం ప్రారంభమైంది. బిగ్‌బాస్ -10 సీజన్ తెలుగు మూడో రోజు ప్రారంభమైన రచ్చతో కంటెస్టుల్లో టెన్షన్ పెరిగింది. రెండో రోజు ప్రారంభమైన మహా పరీక్ష మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇంటిలో ఉన్న కంటెస్టులకు పనులు, బాధ్యతలను కేటాయించే క్రమంలో చిన్నపాటి వివాదాలు పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో చరణ్, ఓ మహిళా కంటెస్టెంట్ మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. తన కాన్ఫిడెన్స్ లెవల్స్‌పై పదేపదే వ్యాఖ్యలు చేయవద్దని చరణ్ హెచ్చరించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.
టాస్క్ ఫెయిల్.. రిష్క్‌లో రామ్ ప్రసాద్, చరణ్
బిగ్‌బాస్‌లో రెండో రోజు మహా పరీక్షలో రెండు టీమ్‌లు ఫెయిల్ అయినట్లు ప్రకటించాడు. ఇందుకు ఒక్కో టీమ్ నుంచి ఒక్కో కంటెస్టు రిష్క్ జోన్‌లో పెట్టాలి. అందుకు టీమ్ సభ్యులు ఎంపిక చేయాలని సూచించాడు. అయితే టీమ్ లీడర్‌గా ఉన్న రామ్‌ప్రసాద్ తనకు తానే రిష్క్ జోన్‌లోకి వెళుతున్నట్టు బిగ్ బాస్ కు చెబుతూ తన కంటెస్టులకు కూడా చెప్పాడు. అందుకు తగిన కారణాలు కూడా చెప్పాడు. రోహిత్ టీమ్ సభ్యులందరూ నిర్ణయించి చరణ్‌ను హైరిష్క్‌లోకి నెట్టారు.
రామ్‌ప్రసాద్‌కు చేజారిన లీడర్… దెబ్జానీ లీడర్
రామ్‌ప్రసాద్ రిష్క్ జోన్‌కు వెళ్లడంతో లీడర్ గా ఉండడానికి వీలు లేదంటు కొత్త వారిని ఎన్నుకోవాలని బిగ్ బాస్ సూచించాడు. దీంతో సభ్యులందరూ కలసి రామ్ ప్రసాద్‌కు ఆ బాధ్యత అప్పగించారు. దీంతో కొత్త లీడర్ గా బెంగాలి భామ డెబ్జానీ ని ఎంపిక చేస్తూ రామ్ ప్రసాద్ నిర్ణయం తీసుకున్నాడు. అందుకు సభ్యులు ఓకే చేశారు.
శాలిని మ్యాజిక్ పవర్.. వర్షిణికి కొత్త బాధ్యత
ఇక శాలిని తనకు లభించిన మ్యాజిక్ కీ పవర్‌ను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంది. తనకు కేటాయించిన వాష్‌రూమ్ క్లీనింగ్ బాధ్యతను వర్షిణికి బదిలీ చేసింది. దీంతో వర్షిణి బిగ్‌బాస్ ఇంట్లో ఉన్నంతకాలం ఆ పనిని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ బాధ్యతను వర్షిణి సంతోషంగా స్వీకరించడం ఆసక్తికరంగా మారింది. వాష్‌రూమ్ క్లీనింగ్‌ను ఒక రకమైన థెరపీగా భావిస్తున్నానని ఆమె చెప్పడం తోటి సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.
వ్యూహాత్మక తప్పిదంపై దెబ్జానీ అసంతృప్తి
మరోవైపు దెబ్జానీ కూడా తమ టీమ్ వ్యూహంపై ఆలోచనలో పడింది. బలహీనంగా ఉన్న కంటెస్టెంట్లకు కొన్ని పనులను కేటాయించి ఉంటే టీమ్‌కు ప్రయోజనం చేకూరేదని ఆమె అభిప్రాయపడింది. ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయామని ఆమె పశ్చాత్తాపం వ్యక్తం చేసింది.
రోహిత్–త్రిగుణ్ మధ్య మళ్లీ రచ్చ
ఎపిసోడ్ ముగింపు కూడా తీవ్ర ఉద్రిక్తతతో సాగింది. రోహిత్, త్రిగుణ్ మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరూ బలమైన వ్యక్తిత్వాలతో పాటు తమ అభిప్రాయాలపై గట్టిగా నిలబడే స్వభావం కలిగినవారిగా కనిపిస్తున్నారు. దీంతో వారి మధ్య విభేదాలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్లీనింగ్ దగ్గర ఇద్దరూ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇద్దరూ ఏ ఒక్కరూ తగ్గలేదు.
