Bigg Boss-9 | 13th week | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బిగ్‌బాస్ -9 చివరి అంకానికి చేరుకుంటోంది. ఈ వారం ఎలిమినేషన్ ఒకరా? ఇద్దరా? అనేది ఉత్కంఠగా(Excitedly) ఉంది. వచ్చే వారం నాటికి ఐదుగురు కుటుంబ సభ్యులు ఉండాలంటే మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులను ఎలిమినేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే బిగ్‌బాస్(bigg boss) ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ వారం ఇద్దర్ని ఎలిమినేషన్ చేస్తారా? ఒకరినే ఎలిమినేషన్ చేస్తారా? అనేది కూడా ఎదురు చూస్తున్నారు.

బిగ్‌బాస్ వద్ద రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఈ వారం ఒకరిని ఎలిమినేషన్ చేసి, వారం మధ్యలో మరొకరిని, అలాగే ఈ వారం చివరిలో మరొకరిని ఎలిమినేషన్ ప్రక్రియ చేస్తారా? లేదా ఈ వారం ఇద్దరిని ఎలిమినేషన్(elemination) చేసి వచ్చే వారం ఒకరిని ఎలిమినేషన్ చేస్తారా? అనేది వీక్షకులతోపాటు కుటుంబ సభ్యులకు కూడా ఊహకందని విషయమే.

Bigg Boss-9 | 13th week | టైటిల్‌కి దగ్గరగా కళ్యాణ్ పడాల
బిగ్‌బాస్ -9 సిజన్‌లో ఈ వారం టికెట్ టు ఫినాలే కు కల్యాణ్ పడాల ఫైనల్స్‌కు వెళ్లిన మొదటి కంటెస్టెంట్‌గా నిలిచాడు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కాకుండా మొదటి ఫైనల్ లిస్టు(final list) కోసం పెట్టిన టాస్క్‌లో కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి మొదటి ఫైనల్ లిస్టుకు చేరుకున్నాడు. అంటే బిగ్‌బాస్-9 టైటిల్(Bigg Boss 9 title)కు దగ్గరకు వెళ్లిపోయాడు. చివరి కెప్టెన్సీ పొందిన కళ్యాణ్.. తొలి ఫైనల్ లిస్టుకు కూడా చేరుకున్నాడు. అయితే రెండో ఫైనల్ లిస్టు టాస్క్ కూడా వచ్చే వారం ఉంటుందని వీక్షకులు అంచనా వేస్తున్నారు.

Bigg Boss-9 | 13th week | టెన్షన్‌లో నామినేట్ సభ్యులు
బిగ్‌బాస్-9 పదమూడో వారంలో తనూజ గౌడ, డీమాన్ పవన్, రీతూ, భరణి, సంజన, సుమన్ శెట్టి నామినేషన్‌లో ఉన్నారు. కెప్టెన్ కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్ నామినేషన్‌లో లేరు. అయితే ఫినాలేకి దగ్గర పడడటంలో అందరూ టాప్-5(top 5)లో ఉండాలని కోరిక సహజం. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే టెన్షన్(tention)లో నామినేట్ సభ్యులు కనిపిస్తున్నారు. నిన్న హోస్ట్ అక్కినేని నాగార్జున వచ్చినప్పుడు కూడా ఎవరి మొఖల్లో వెలుగులు కనిపించలేదు. అనధికారిక సమాచారం మేరకు తనూజ గౌడకు అత్యధిక ఓట్లు(votes) పడినట్లు సమాచారం.

ఎప్పుడు వెనుకబడి ఉన్న డీమాన్ పనవ్ ఈ సారి రెండో స్థానంలోకి వచ్చాడని కూడా సమచారం. ఇక మిగిలిన భరణి, సంజన, రీతూ చౌదరి, సుమన్‌శెట్టి వెనుకబడి ఉన్నట్లు వీక్షకులు(viewers) భావిస్తున్నారు. ఇద్దరు గానీ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి, సంజన, రీతూ చౌదరి ముగ్గురిలో ఏ ఇద్దరికో వీక్షకులు ఓటింగ్ ద్వారా బయటకు పంపించే అవకాశం ఉంది. ఒకరైతే సుమన్ శెట్టి, సంజన ఎవరో ఒకరు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని పలువురు(Many) భావిస్తున్నారు.

