Bigg Boss 10 Telugu |త్రిగుణ్ ‘వెన్నుపోటు’ కామెంట్స్, బోటు టాస్క్‌లో రచ్చ.. కెప్టెన్సీ రేసులో రెడ్ టీమ్ హవా!
ఆంధ్రప్రభ, సినిమా ప్రతినిధి : బిగ్ బాస్ హౌస్‌లో రోజులు గడుస్తున్న కొద్దీ ఆట మరింత హీటెక్కుతోంది. ముఖ్యంగా 25వ రోజు ఎపిసోడ్ మాత్రం మాటల తూటాలు, ఊహించని ట్విస్టులు, గ్రూప్ పాలిటిక్స్‌తో ఫుల్ మసాలా అందించింది. ఒకవైపు సుధీర్‌ను ‘పప్పెట్’ అంటూ రోహిత్ టీజ్ చేయడం, మరోవైపు షాలినిపై త్రిగుణ్ చేసిన ‘వెన్నుపోటు’ కామెంట్స్ హౌస్‌లో పెద్ద ప్రకంపనలే సృష్టించాయి. దీనికితోడు ‘సెయిల్ టు డామినేట్’ బోట్ టాస్క్‌లో లేడీ కంటెస్టెంట్ల మధ్య రచ్చ, కెప్టెన్సీ రేసు కోసం టీమ్ భైరవ చూపించిన ఆధిపత్యం ఎపిసోడ్‌ను మరింత రసవత్తరంగా మార్చాయి. మరి డే 25 ఎపిసోడ్‌లో అసలేం జరిగింది? ఎవరు ఎవరిపై పైచేయి సాధించారు? పూర్తి వివరాలు చూద్దాం!
రోహిత్ వర్సెస్ సుధీర్.. త్రిగుణ్ ‘వెన్నుపోటు’ బాంబ్!
గత ఎపిసోడ్‌లో సుధీర్, రోహిత్ మధ్య మొదలైన గొడవ ఈ రోజూ కొనసాగింది. సుధీర్‌ను ‘పప్పెట్’ అంటూ రోహిత్ గేలి చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ క్రమంలో “నాకు, షాలినికి మంచి బాండింగ్ ఉంది” అని సుధీర్ చెప్పగా.. మధ్యలో దూరిన త్రిగుణ్ “మంచిగా ఉంటూనే వెన్నుపోటు పొడుస్తుంది, జాగ్రత్త!” అంటూ బాంబ్ పేల్చాడు. దాంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
ఈ విషయాన్ని షాలిని రోహిత్ వద్ద ప్రస్తావించగా.. “త్రిగుణ్ తన క్యారెక్టర్‌ను ఎదుటివారిలో చూసుకుంటాడు, అందుకే అలా మాట్లాడాడు” అని రోహిత్ కొట్టిపారేశాడు. మరోవైపు రోహిత్ తన డ్రాగన్‌ను అపూర్వకు ఇస్తూ.. “నాకు ఇమ్యూనిటీ వద్దు, గేమ్ జెన్యూన్‌గా ఆడతాను” అని స్పష్టం చేశాడు.

మార్నింగ్ అలారం.. అపూర్వ పనిష్మెంట్
25వ రోజు ఉదయం కంటెస్టెంట్లు ‘పుష్ప’ పాటతో హుషారుగా నిద్రలేచారు. అమన్ మైక్ ధరించకపోవడంతో బిగ్ బాస్ గట్టి హెచ్చరిక జారీ చేశాడు. దాంతో కెప్టెన్ అపూర్వ అతడికి స్విమ్మింగ్ పూల్‌లో దూకాలని పనిష్మెంట్ ఇవ్వగా, అమన్ నిర్మొహమాటంగా తిరస్కరించాడు. ఇదే సమయంలో త్రిగుణ్ కెప్టెన్ రూమ్ క్లీన్ చేస్తున్నట్లు నటిస్తూ డ్రాగన్ ఎక్కడుందో వెతకడం మొదలుపెట్టాడు.

త్రిగుణ్ మైండ్ గేమ్‌లు .. బాత్రూమ్ వీడియో
త్రిగుణ్ నేరుగా కెమెరాతో మాట్లాడుతూ.. “రెడ్ టీమ్‌లో చాలా స్ట్రాంగ్ మెంబర్స్ ఉన్నారు, బ్లూ టీమ్‌లో అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు. నేనే కావాలని రెడ్ టీమ్‌లో చిచ్చు పెట్టాను, అందుకే వాళ్లలో వాళ్లే గొడవపడుతున్నారు” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వర్షిణి దగ్గర ఏదో ‘మ్యాజికల్ పవర్’ ఉందని కనిపెట్టి, ఆ విషయాన్ని కూడా కెమెరాకు వివరించాడు.ఇక బాత్రూమ్ ఏరియాలో రోహిత్, షాలిని హగ్ చేసుకున్న వీడియోను చూపించగా.. గతంలో షాలిని చేసిన డ్రాగన్ దొంగతనం గురించి ఇద్దరూ చర్చించుకున్నారు.

టాస్క్ 1: ‘చిక్కులెక్కలు’.. రెడ్ టీమ్ ఖాతాలో విజయం
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ‘చిలకల లెక్కలు’ అనే పజిల్ గేమ్‌ను పెట్టారు. రెడ్ టీమ్ నుంచి ఝాన్సీ, అపూర్వ, రోహిత్, వర్షిణి కంటెండర్లుగా దిగారు. అయితే అడ్వాంటేజ్ టాస్క్ ద్వారా లభించిన వెసులుబాటుతో ప్రత్యర్థి బ్లూ టీమ్ నుంచి ఎవరు ఆడాలో రెడ్ టీమ్ నిర్ణయించింది. వారు షాలిని, దేబ్జాని, నరేష్, ముఖేష్‌లను ఎంపిక చేశారు.
త్రిగుణ్ సంచాలక్‌గా వ్యవహరించిన ఈ గేమ్‌లో రెడ్ టీమ్ ఘన విజయం సాధించింది. గెలిచినందుకు గాను ఝాన్సీకి డ్రాగన్ దక్కించుకునే అవకాశం రావడంతో, ఆమె షాలిని దగ్గరున్న డ్రాగన్‌ను లాక్కుంది.

త్రిగుణ్‌కు షాక్.. రామ్‌ప్రసాద్ స్కిట్‌తో ఫన్
రెడ్ టీమ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో.. ప్రత్యర్థి ‘సప్తశక్తి’ టీమ్ నుంచి ఒకరిని కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాలని బిగ్ బాస్ ఆదేశించాడు. దాంతో భైరవ టీమ్ నేరుగా త్రిగుణ్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించింది. అనంతరం త్రిగుణ్, వర్షిణి హౌస్‌లో ఏర్పడుతున్న గ్రూపుల గురించి చర్చించుకున్నారు.
మరోవైపు రామ్‌ప్రసాద్ నిద్రపోవడంతో కుక్కల మొరుగుడు సౌండ్ వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు హౌస్‌మేట్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో.. ఈ వారం ఇంట్లో జరిగిన గొడవలపై ఓ పేరడీ స్కిట్ చేసి అందరినీ నవ్వించారు.

లేడీస్ స్పెషల్: ‘సెయిల్ టు డామినేట్’.. హౌస్‌లో తీవ్ర దుమారం
కెప్టెన్సీ కంటెండర్స్ కోసం ‘సెయిల్ టు డామినేట్’ (బోట్ గేమ్) అనౌన్స్ చేశారు. ఇందులో మహిళలు మాత్రమే ఆడాలని నిబంధన విధించడంతో ఇంట్లో తీవ్ర రచ్చ మొదలైంది.
బ్లూ టీమ్‌లో షాలిని, దేబ్జాని మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, షాలిని ఏడుస్తూ రోహిత్‌కు చెప్పుకుంది. చివరికి బ్లూ టీమ్ నుంచి సృష్టి, దేబ్జాని పోటీకి దిగారు.
రెడ్ టీమ్ నుంచి వర్షిణి, అపూర్వ ఆడతారని చెప్పగా.. రోహిత్ అడ్డుతగిలాడు. “మొదట ఝాన్సీ అనుకున్నారు కదా, సడన్‌గా వర్షిణి ఎలా వచ్చింది?” అని ప్రశ్నించడంతో పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆఖరికి వర్షిణి, అపూర్వలే రంగంలోకి దిగారు.

బోట్ గేమ్‌లో డ్రామా.. బ్లూ టీమ్ విజయం
ఈ గేమ్‌లో టీమ్ భైరవకు అడ్వాంటేజ్ ఉండగా, త్రిగుణ్ సంచాలక్‌గా వ్యవహరించాడు. టాస్క్ జరుగుతుండగా అపూర్వ బోటు పైనుంచి కింద పడిపోవడంతో త్రిగుణ్ ఆమెను ‘అవుట్’ అని ప్రకటించాడు. దాంతో అపూర్వ గొడవకు దిగింది. హౌస్‌మేట్స్ నిర్ణయంతో ఆమెను మళ్లీ గేమ్‌లోకి అనుమతించారు. నలుగురు మహిళలు నువ్వా-నేనా అన్నట్లు తలపడిన ఈ పోరులో బ్లూ టీమ్ (సప్తశక్తి) విజయం సాధించింది.గెలిచిన బ్లూ టీమ్ సభ్యులలో దేబ్జాని రోహిత్ డ్రాగన్‌ను, సృష్టి వర్షిణి డ్రాగన్‌ను సొంతం చేసుకున్నారు.
కెప్టెన్సీ రేసులో రెడ్ టీమ్ క్లీన్ స్వీప్!
డామినేషన్ టాస్క్‌లో మొత్తం 3 గేమ్‌లలో 2 గేమ్‌లు టీమ్ రెడ్ (భైరవ) గెలుపొందడంతో.. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్లు అందరూ రెడ్ టీమ్ నుంచే ఉంటారని బిగ్ బాస్ ప్రకటించడంతో ఎపిసోడ్ ముగిసింది.

