Big Boss E 6 |మహాపరీక్షలో మరో ట్విస్ట్.. హూస్‌ నుంచి రెండో కంటెస్టెంట్‌ ఔట్‌

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: బిగ్‌బాస్ తెలుగు 10లో ‘మహాపరీక్ష’ కొనసాగుతోంది. ఇప్పటికే టీమ్‌లుగా సాగిన ఆటను బిగ్‌బాస్ మార్చేశారు. ఇక నుంచి రెడ్, బ్లూ టీమ్‌లు ఉండవని.. ప్రతి ఒక్కరూ విడిగా గేమ్ ఆడాలని చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరికి హౌస్‌మేట్‌గా మారే అవకాశం ఇవ్వగా.. మరోవైపు నలుగురు కంటెస్టెంట్లు హైరిస్క్ జోన్‌లోకి వెళ్లారు. చివరికి చైత్ర రాయ్ హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.

హౌస్‌లో మారుతున్న లెక్కలు

టాస్కులు మొదలయ్యే ముందు హౌస్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. శాలిని, రోహిత్, అమన్ కలిసి ఝాన్సీ గురించి మాట్లాడుకున్నారు. ఆమె వేరే టీమ్‌కి చెందిన కంటెస్టెంట్లతో ఎక్కువగా ఉంటోందని చర్చించారు. అయితే శాలిని మాత్రం ఝాన్సీ చాలా తెలివిగా గేమ్ ఆడుతోందని చెప్పింది.ఇక రోహిత్, దేవజానీ మధ్య ఉన్న గొడవ కూడా కాస్త తగ్గింది. ఇద్దరూ మాట్లాడుకుని మళ్లీ సెట్ అయ్యారు. త్రిగుణ్‌తో ఎక్కువగా గొడవ పడొద్దని దేవజానీ.. రోహిత్‌కు చెప్పింది. అలా చేస్తే చివరికి రోహిత్‌కే ఇబ్బంది అవుతుందని సూచించింది.అయితే రోహిత్ మాత్రం త్రిగుణ్ తనకు వస్తున్న గుర్తింపును తట్టుకోలేకపోతున్నాడని శ్రీష్టి, శాలినితో చెప్పాడు.

ఇక టీమ్ గేమ్‌కు గుడ్‌బై..

బిగ్‌బాస్ కొత్త రూల్ ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న రెడ్, బ్లూ టీమ్‌లను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి కంటెస్టెంట్ వ్యక్తిగతంగా పోటీ పడాల్సి ఉంటుంది.11 మంది కంటెస్టెంట్లలో ఏడుగురు సింపుల్ టాస్క్ ఆడాలి. ఇద్దరు కఠినమైన టాస్క్‌లో పాల్గొనాలి. మరో ఇద్దరు టాస్క్ ఆడకుండా ఉండొచ్చు.ఈ అవకాశం వచ్చినప్పుడు ముకేశ్, త్రిగుణ్ టాస్క్ నుంచి తప్పుకున్నారు. తమ స్థానంలో మిగతా వారికి అవకాశం ఇచ్చారు. దీంతో వీరి నిర్ణయాన్ని హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లు మెచ్చుకున్నారు.ఇక కఠినమైన టాస్క్ కోసం వర్షిణి, సుధీర్ ముందుకు వెళ్లారు.

రామ్ ప్రసాద్‌కు హౌస్‌మేట్ అవకాశం..

సింపుల్ టాస్క్‌లో భాగంగా ‘రన్ రాజా రన్’ గేమ్ జరిగింది. ఇది ఖోఖో తరహాలో సాగింది. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలక్‌గా ఉన్నాడు.చివరికి రామ్ ప్రసాద్, నరేశ్ మధ్య పోటీ జరిగింది. ఇందులో రామ్ ప్రసాద్ గెలిచాడు. దీంతో ఆయన హౌస్‌మేట్‌గా తన స్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే గెలిచిన తర్వాత రామ్ ప్రసాద్‌కు మరో అవకాశం వచ్చింది. హైరిస్క్ జోన్‌లోకి ఎవరిని పంపాలో నిర్ణయించే ఛాన్స్ ఆయనకు ఇచ్చారు. రామ్ ప్రసాద్ అమన్ పేరును ఎంచుకున్నాడు.

దీనిపై రోహిత్ అమన్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రామ్ ప్రసాద్ పాత కోపంతోనే నిన్ను ఎంపిక చేశాడని చెప్పాడు. అయితే అమన్ కూడా వెంటనే కౌంటర్ ఇచ్చాడు. శాలినిని కాకుండా తనను ఎంపిక చేయడంపై రోహిత్‌కు ఇబ్బంది లేదుగా అంటూ ప్రశ్నించాడు. దీంతో రోహిత్‌కు ఏం చెప్పాలో కాసేపు అర్థం కాలేదు.

వర్షిణి, సుధీర్‌కు షాక్ ఇచ్చిన బిగ్‌బాస్

వర్షిణి, సుధీర్‌కు ఇచ్చిన కఠినమైన టాస్క్ కూడా ఆసక్తికరంగా సాగింది. వారిద్దరినీ విడివిడిగా పిలిచి కేక్ చూపించారు. దాన్ని ఎంత త్వరగా తినగలరని అడిగారుఅంతలో మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి వచ్చి కేక్‌ను పాడు చేశాడు.అసలు గేమ్ ఏంటంటే.. కేక్‌ను అవతలి వ్యక్తే పాడు చేశాడని ఎక్కువ మంది హౌస్‌మేట్స్‌ను నమ్మించాలి. ఎవరు ఎక్కువ మందిని నమ్మిస్తే వారు గెలిచినట్లు.అయితే రామ్ ప్రసాద్‌కు మొదట్లోనే ఇది సీక్రెట్ టాస్క్ అని అనుమానం వచ్చింది. ముకేశ్ కూడా అదే విషయాన్ని గుర్తించాడు. దీంతో వర్షిణి, సుధీర్ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాలేదు.ఫలితంగా వారిద్దరికీ హౌస్‌మేట్ అయ్యే అవకాశం రాలేదు.

చైత్ర ఇంటి నుంచి ఔట్

చివరికి అమన్, చైత్ర, వర్షిణి, సుధీర్ హైరిస్క్ జోన్‌లో మిగిలారు. వీరిలో ఎవరికి హౌస్‌లో ఉండే అర్హత లేదో వాళ్లే నిర్ణయించుకోవాలని బిగ్‌బాస్ చెప్పారు.చైత్ర.. సుధీర్ పేరు చెప్పింది. కానీ అమన్, వర్షిణి, సుధీర్ ముగ్గురూ చైత్ర పేరునే చెప్పారు.ముగ్గురు చైత్రను ఎంచుకోవడంతో ఆమె ఎలిమినేట్ అయింది.రెండో కంటెస్టెంట్‌గా చైత్ర రాయ్ ఎలిమినేషన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే చైత్ర రాయ్ ప్రయాణం ముగిసింది. ప్రారంభ రోజుల్లో ఆమెకు ఎక్కువగా స్క్రీన్ టైమ్ కూడా రాలేదు. దీంతో ప్రేక్షకులకు ఆమె ఆట పూర్తిగా అర్థమయ్యేలోపే ఎలిమినేషన్ జరిగింది.

మహాపరీక్షలో ఇప్పటికే ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లగా.. ఇప్పుడు చైత్ర రాయ్ రెండో ఎలిమినేషన్‌గా నిలిచింది. ఇక టీమ్ గేమ్ ముగిసి అందరూ వ్యక్తిగతంగా ఆడాల్సి ఉండటంతో.. రాబోయే రోజుల్లో బిగ్‌బాస్ హౌస్‌లో గేమ్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.