Bhimgal Town | ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి…

Bhimgal Town | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : తాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల రాజశ్రీ, మల్లెల లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు తొమ్మిదో వార్డు లోని శివ గల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక నాయకుడిగా ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం చేయాలో తెలిసిన నాయకుడిగా తనను ఆదరించి గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ గా రెండేండ్లు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి చేసిన సేవలను గుర్తు చేశారు.
యువతకు, మహిళలకు, సంఘాల అభివృద్ధి కొరకు తాను ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, తనకు మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలు వచ్చినప్పుడు అందుబాటులో ఉండి ఫోన్ లిఫ్ట్ చేసే నాయకులను గుర్తించాలని, మాటలు చెప్పి పబ్బం గడుపుకునే వారిని దూరం ఉంచాలని సూచించారు. ఈ సందర్బంగా శివ గల్లితో పాటు తొమ్మిదో వార్డు లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ సహకారంతో తొమ్మిదో వార్డు ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఆయన వెంట శివ గల్లీ యువకులు, మహిళలు ఉన్నారు.
